MOVIE NEWS

రెజీనా, అనుప‌మ పర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘మ‌రీచక’.. ఆకట్టుకుునేలా కాన్సెప్ట్ పోస్టర్

Regina and Anupama Parameswaran starrer 'Mareechaka'.. Impressive concept poster

సినీ ప్రేమికులకు, అభిమానులకు ఎగ్జ‌యిట్‌మెంట్ పెంచే వార్త ఇది. అందం, అభినయంతో ఆక‌ట్టుకుంటోన్న బ్యూటీఫుల్ హీరోయిన్స్ రెజీనా క‌సాండ్ర‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. స‌తీష్ కాశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘మ‌రీచక’ అనే టైటిల్‌ను ఖ‌రారు చ‌శారు. విజ‌య్ అశ్విన్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ‘మ‌రీచక’ అనే టైటిల్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. క‌ళ్ల‌ను క‌నిక‌ట్టు చేసే భ్ర‌మ అని  ఈ టైటిల్‌కు అర్థం

అంద‌రిలో ఆస‌క్తి పెంచుతోన్న ‘మరీచక’ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను గురువారం రోజున విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే అందులో కేవ‌లం పాదాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఆ పాదాల ప్ర‌తిబింబం నీళ్ల‌లో ఓ అమ్మాయి నీడ‌లాగా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్‌కు ‘ప్రేమ ద్రోహం ప్ర‌తీకారం’ అనేది క్యాప్షన్. ఈ పోస్ట‌ర్ అంద‌రిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఉన్న ఆస‌క్తిని మ‌రింత పెచింది.

ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. జూలై 26 నుంచి రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ఈ రొమాంటిక్ డ్రామాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అర‌వింద్ క‌న్నాభిరాన్ ఈ మూవీకి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

వ‌న్ మోర్ హీరో బ్యాన‌ర్‌పై రవి చిక్కాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌క్ష్మీ భూపాల ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, పాట‌ల‌ను అందించారు. దీంతో పాటు ల‌క్ష్మీ భూపాళ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ  చిత్రానికి స‌హ నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించారు.

20 ఏళ్ల పాటు యానిమేష‌న్ రంగంలో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకుని రాజీవ్ చిక్కా ఛోటా భీమ్‌ను రూపొందించారు. ఇప్పుడు వ‌న్ మోర్ హీరో అనే బ్యాన‌ర్‌ను ప్రారంభించారు.

ప్రొడ్యూస‌ర్ :  రాజీవ్ చిక్కా
ద‌ర్శ‌క‌త్వం :  స‌తీష్ కాశెట్టి

స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌, పాట‌లు :  ల‌క్ష్మీ భూపాల‌
కో ప్రొడ్యూస‌ర్ : ల‌క్ష్మీ భూపాల‌
అసోసియేట్ ప్రొడ్యూస‌ర్స్ : ల‌క్ష్మీ భూప‌తి, సురేష్ ల‌డ్డునూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ :  విజ‌య్ శంక‌ర్ డొంక‌
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ :  అక్షిత అక్కి
సినిమాటోగ్ర‌ఫీ :  అర‌వింద్ క‌న్నాభిరాన్‌
ఎడిట‌ర్ :  జునైద్ సిద్ధిఖీ
ఆర్ట్ డైరెక్ట‌ర్ :  విఠ‌ల్ కోస‌నం
స్టంట్ మాస్ట‌ర్ :  డ్రాగ‌న్ ప్ర‌కాష్
పి.ఆర్‌.ఓ:  వంశీ కాక‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్ :  అనీల్ భాను

Tags

Related Articles

Back to top button
Close
Close