MOVIE NEWS

పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత ‘యశోద’ చిత్రం!!

Samantha's Yashoda shoot wrapped up, except a song!!

Samantha’s Yashoda

ఫస్ట్ గ్లింప్స్ తోనే అంచనాలు భారీగా పెంచేసిన సమంత ‘యశోద’ చిత్రం షూటింగ్ ఒక సాంగ్ మినహా టాకీ మొత్తం పూర్తయింది.

శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14 గా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం  వహిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘’సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో మా యశోద చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాం. సాంగ్ మినహా టాకీ షూట్ మొత్తం పూర్తయింది. ఒకవైపు గ్రాఫిక్స్ పని జరుగుతుండగా  ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నాం ఆ వెంటనే ఇతర భాషల డబ్బింగ్ కూడా జరుగుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కుడా అదే స్థాయిలో చేయబోతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల చేయడానికి ‘యశోద’ పూర్తిగా సిద్ధమాయ్యాకే మంచి తేదీ చూసుకుని కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాము. అలాగే రానున్న రోజుల్లో చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ విడుదల మరియు ఇతర వివరాలు తెలియజేస్తాము. సమంత ‘యశోద’ పాత్రని సొంతం చేసుకున్న తీరు చూస్తే చాలా గర్వంగా ఉంది. చాలా ఏకాగ్రతతో, పూర్తి డెడికేషన్ తో యాక్షన్ మరియు ఇతర సన్నివేశాలు అద్భుతంగా చేసింది. సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుంది. నటీ నటులు, సాంకేతిక నిపుణులు అందరూ చిత్రం అద్భుతంగా వచ్చేలా సహకరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్నాం’’ అని చెప్పారు.

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

సంగీతం: మణిశర్మ
మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి,
పాటలు: చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి
క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి
కెమెరా: ఎం. సుకుమార్
ఆర్ట్: అశోక్
ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక
సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి
దర్శకత్వం: హరి – హరీష్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

Samantha’s Yashoda shoot wrapped up, except a song!!

While the earlier released First Glimpse of Samantha’s ‘Yashoda’ created a huge buzz all-over India, movie team wrapped up the shoot except for a song.

With huge expectations on its enthralling content directed by talented duo Hari-Harish, Senior producer Sivalenka Krishna Prasad is producing it as Production No. 14 under Sridevi Movies banner.

Speaking on the occasion, producer Sivalenka Krishna Prasad says “Wrapping up the shoot in 100 days, we’re making Yashoda on uncompromised budget. With just one song left for shoot, our CG work is already in progress. As the dubbing works to begin from 15th of this month, we’ll finish dubbing work for other languages simultaneously. Also, we’re planning to promote this Pan-Indian film on a large scale. Keeping all this in mind, we’ve decided to make the output of this edge-of-the-seat thriller perfectly ready for a Worldwide release. Samantha has showed sheer dedication and commitment in playing the Titular role, especially in the high-octane action sequences. Aiming to release in Telugu, Tamil, Hindi, Malayalam and Kannada, teaser and songs are on the way to raise the expectations”

Besides Samantha, Varalaxmi Sarathkumar, Unni Mukundan, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Shatru, Madhurima, Kalpika Ganesh, Divya Sripada, Priyanka Sharma and others are playing major roles.

Music: Manisharma,
Dialogues: Pulagam Chinnarayana, Dr. Challa Bhagyalaxmi
Lyrics: Chandrabose, Ramajogiah Sastry
Creative Director: Hemambar Jasthi
Camera: M. Sukumar
Art: Ashok
Fights: Venkat
Editor: Marthand. K. Venkatesh
Line Producer: Vidya Sivalenka
Co-producer: Chinta Gopalakrishna Reddy
Direction: Hari – Harish
Producer: Sivalenka Krishna Prasad
Banner: Sridevi Movies.


Regards!Pulagam Chinnarayana

Tags

Related Articles

Back to top button
Close
Close