Events/PressmeetsMOVIE NEWSNEWS

హైదరాబాద్‌లో శ్యామల్‌ & భూమిక ది వెడ్డింగ్‌ కోచర్‌ కలెక్షన్‌ 2022ను ప్రారంభించి సందడి చేసిన ప్రముఖ నటి అదితి రావు హైదరి

Popular actress Aditi Rao Hydari launched Shyamal & Bhumika The Wedding Couture Collection 2022 in Hyderabad.

True-blue superstar Aditi Rao Hydari, flanked by designers (L-R) Shyamal & Bhumika, after unveiling The Wedding Couture Collection 2022, from Shyamal & Bhumika, India’s leading fashion house drawing inspiration from the rich Indian heritage & culture, today at Shyamal & Bhumika, Banjara Hills.

హైదరాబాద్‌లో శ్యామల్‌ & భూమిక ది వెడ్డింగ్‌ కోచర్‌ కలెక్షన్‌ 2022ను ప్రారంభించి సందడి చేసిన  ప్రముఖ నటి అదితి రావు హైదరి

హైదరాబాద్‌, జూలై 2022 : శ్యామల్‌ మరియు భూమిక యొక్క ది వెడ్డింగ్‌ కోచర్‌ కలెక్షన్‌ 2022ను తమ అన్ని స్టోర్ల కంటే ముందు హైదరాబాద్‌ స్టోర్‌లోనే మొదటిసారి ప్రత్యేకంగా ప్రారంభించబడింది, ది వెడ్డింగ్‌ కోచర్‌ కలెక్షన్‌ 2022 అనేది ప్రసిద్ది చెందినటువంటి ఫ్యాషన్‌ డిజైన్‌ వస్త్రశ్రేణి, ఇవి చేతితో ఎంబ్రాయిడరీ చేయబడిన చిత్రాలు మరియు రంగులతో నిండిన మాస్టర్‌పీస్‌లకు చెందిన అందమైన శ్రేణికి చెందినవి, పురాతనమైన హస్తకళా నైపుణ్యాలను ఉపయోగించి వీటిని రూపొందించడం జరిగింది.  భారత ఉపఖండంకు చెందిన గొప్ప సంస్కృతి మరియు వారసత్వం పట్ల వీరిద్దరికి ఉన్నటువంటి అమితమైన గౌరవం ఈ కలెక్షన్‌లో ప్రకాశిస్తుంది.

పండుగ వాతావరణం అందించిన ప్రోత్సాహంతో ప్రకృతి, మన చరిత్ర మరియు సంప్రదాయాలు, పురాతన వాస్తుశిల్పం, రాజ దర్బార్‌ల వైభవం, మ్యూజియంలు, అరుదైన ప్రయివేట్‌ కలెక్షన్‌ మరియు పురాతన వస్తువుల అమ్మే మార్కెట్‌ల నుండి ప్రేరణను పొంది అద్బుతమైన ఈ వస్త్రశ్రేణిను డిజైనర్లు రూపొందించారు. ఈ నూతన వస్త్రశ్రేణితో వధూవరుల వేడుకలో మిమ్మల్ని ఫాంటసీ లోకంలో విహరించేలా చేస్తాయి.

అందమైన చేతి ఎంబ్రాయిడరీలు, చేతితో నేసిన మరియు పైన వేసిన అల్లికలు లేకుండా వేడుకైన భారతీయ వస్త్రాలు అసంపూర్ణంగా ఉంటాయి. స్పార్కల్‌, వికసించే పుష్పాలు, ఝరోఖాలు, అందమైన జాలీలు, రాచరిక ఆభరణాల నమూనాలు, జాడే షాన్డిలియర్లు, పాత హవేలీలలో చెక్కతో చెక్కిన నమూనాలు వంటి వారసత్వ కళకు సంబంధించిన, మెరుపు స్పర్శతో విలాసవంతమైన రంగులలో సున్నితమైన ఉపరితల అలంకారాలతో ఈ కలెక్షన్‌ అద్బుత కళాకృతిలో కనిపిస్తాయి. కళానైపుణ్యాల పట్ల ఎంతో మక్కువతో, దేశీయంగా రూపొందించిన ఈ కలెక్షన్‌ను రూపొందిస్తున్నప్పుడు, వస్త్రశ్రేణిలో పాతకాలపు రోజ్‌ మరియు పురాతన బంగారం దారాలతో ఆరి, జర్దోసీ వంటి పురాతన కళా నైపుణ్యాల పద్ధతులను ఉపయోగించారు. మేము ఒక వస్త్రం తయారు చేయడంలో వివిధ కాలాలకు చెందిన పాత పద్ధతులను కలుపుకుంటూ ప్రయోగాలు చేసి ఈ కలెక్షన్‌ను రూపొందించడం జరిగింది.  వివిధ హస్తకళలు మరియు ఎంబ్రాయిడరీల కలయికతో పైన ధరించే ఆభరణాలు, పాతకాలపు బంగారు డోరీ మరోడి, షిమ్మర్‌ సీక్వినింగ్‌ లేయర్లు, గాజు పూసలు మరియు చేతితో తయారు చేసిన పట్టు దారాలతో వివిధ రంగులలో ఎంతో స్పష్టంగా అలంకరించబడి ఉంటాయి.

ఈ కలెక్షన్‌లో కాలిదార్‌ ఘెర్దార్‌ లెహంగాలు, ట్రయిలింగ్‌ హెడ్‌ వాయిల్స్‌, ఫిట్టెడ్‌ చోలీస్‌, డ్రామాటిక్‌ హెమ్‌లైన్‌లు, ఎడ్వర్డియన్‌ స్లీవ్‌లు, సెమీ కన్‌స్ట్రక్టెడ్‌ శారీస్‌, కాలిదార్‌ కుర్తాలు, డ్రేప్‌డ్‌ కౌల్స్‌, స్ట్రెయిట్‌ ఫిట్‌ కమీజ్‌లు, ఫిట్టెడ్‌ చురిడార్‌లు, క్లాసిక్‌ షహరాస్‌లను మెరిసిపోయే ఎంబ్రాయిడరీతో చేసిన బెల్ట్‌లు, క్లచ్‌ బ్యాగులు మరియు బట్వాల వంటి ఆకర్షణీయమైన ఉపకరాణలతో కలిపి అందుబాటులోకి తీసుకువచ్చారు.

నిర్ధిష్టకాలానికి చెందిన కాస్ట్యూమ్‌ల నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసిన పురుషుల దుస్తులలో ట్రౌజర్లు మరియు  ఫిట్టెడ్‌ చురీదార్‌లతో కూడిన షేర్వాణీలు, కాలిదార్‌ కుర్తాలతో కూడిన క్లాసిక్‌ షేర్వాణీలు, బంధ్‌గాలాలు, వైవిధ్యమైన జాకెట్‌లు, పురుషుల బందీ జాకెట్‌లు మరియు సొగసైన కుర్తాలు వంటివి ఉన్నాయి.

డిజైనర్లు నిలకడైన, పర్యావరణ అనుకూలమైన మరియు చేతితో నేసిన కలెక్షన్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ, మెరిసిపోయే ముడి సిల్క్‌, చేతితో నేసిన మట్కా సిల్క్‌లు, షీర్‌ సిల్క్‌ ఆర్గాన్జా, టల్లేతో పాటుగా చేతితో రంగులు వేసిన వెల్వెట్‌లను కలెక్షన్‌లో భాగంగా అందిస్తున్నారు.  ఫ్లేమింగ్‌ రెడ్‌,  ఎమరాల్డ్‌ గ్రీన్‌, వింటేజ్‌ రోజ్‌, పౌడర్‌-బ్లూ, ఆల్మండ్‌ బీజ్‌, ఐవరీ, మాస్‌ & ఫెన్నెల్‌, గ్రీన్‌ కలర్‌, రూబీ-రెడ్‌, షెల్‌-పింక్‌, రాయల్‌-బ్లూ, జాడే-గ్రీన్‌, రాస్ప్‌బెర్రీ మరియు చెర్రీ టోన్‌ వంటి అద్బుతమైన రంగులను కలెక్షన్‌లో ఉపయోగించారు.

హిస్టరీని డిజైన్‌ చేస్తున్నప్పుడు, భారతీయ దుస్తుల కలెక్షన్‌లో శ్యామల్‌ & భూమిక వాస్తవ వ్యక్తిని మరియు నేటి కాలంలో వారి డిజైన్‌ల ఔచిత్యాన్ని గుర్తుంచుకుని డిజైన్‌ చేశారు. ఇందులో ఒక యుగపు అనుభూతిని కలిగించే ప్రయత్నం ఉంది మరియు  దుస్తులను కాస్ట్యూమ్స్‌ లాగా డిజైన్‌ చేయకపోవడం విశేషం.

ఈ సంతోషకరమైన సందర్బాన్ని పురస్కరించుకని, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ద్వయం మాట్లాడుతూ, ‘‘మా తాజా వెడ్డింగ్‌ కోచర్‌ 2022 కలెక్షన్‌ను హైదరాబాద్‌లో రాయల్‌ సెలబ్రిటీ అదితి రావు హైదరితో ప్రారంభింపచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా సరికొత్త కలెక్షన్‌ గంభీరమైన వైభవానికి ప్రతీక, కాబట్టి రాజ వంశానికి చెందిన అందగత్తె అదితి రావు హైదరీతో కలసి అద్భుతమైన రాయల్‌ సిటీ హైదరాబాద్‌లో మొదట ప్రారంభించడం మాకు చాలా అద్బుతంగా అనిపిస్తున్నది. మేము మా అందమైన కొత్త షోకేస్‌కి మా కస్టమర్లను సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము మరియు మా కలెక్షన్‌ను  ఢిల్లీ, అహ్మదాబాద్‌, ముంబై మరియు ఎల్‌ఎ, యూఎస్‌ఎ స్టోర్‌లలో త్వరలో ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నాము.’’ అన్నారు.

శ్యామల్‌ & భూమిక యొక్క వెడ్డింగ్‌ కోచర్‌ 2022 కలెక్షన్‌ హైదరాబాద్‌ స్టోర్‌ను సూపర్‌ స్టార్‌ అదితి రావ్‌ హైదరితో కలిసి ప్రారంభించారు మరియు అహ్మదాబాద్‌, ముంబై, ఢిల్లీ మరియు ఎల్‌ఎ, యూఎస్‌ఎ స్టోర్‌లలో త్వరలో ప్రారంభమవుతుంది.

True-blue superstar Aditi Rao Hydari, after unveiling The Wedding Couture Collection 2022, from Shyamal & Bhumika, India’s leading fashion house drawing inspiration from the rich Indian heritage & culture, today at Shyamal & Bhumika, Banjara Hills.

మరింత సమాచారం కోసం దయచేసి  www.shyamalbhumika.com ను సందర్శించండి.

ఇన్‌స్టాగ్రామ్‌ : @ShyamalBhumika                       ఫేస్‌బుక్‌ : Shyamal Bhumika

స్టోర్‌ చిరునామా :

ఉమా ఎన్‌క్లేవ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, రోడ్‌ నంబర్‌ 9, బంజారా హిల్స్‌, హైదరాబాద్‌, తెలంగాణ 500034

గ్రౌండ్‌ ఫ్లోర్‌, క్రాస్‌వర్డ్‌ పక్కన మొహమ్మద్‌భాయ్‌ మాన్షన్‌, కెంప్స్‌ కార్నర్‌ ఫ్లైఓవర్‌ క్రింద, ఎన్‌ ఎస్‌ పాట్కర్‌ మార్గ్‌, కుంబల్లా హిల్‌, ముంబై.

343, 2వ అంతస్తు, డిఎల్‌ఎఫ్‌ ఎంపోరియో, వసంత్‌ కుంజ్‌, న్యూఢిల్లీ

లెమన్‌ ట్రీ హోటల్‌ లేన్‌ ఎదురుగా, మెడిసర్జ్‌ హాస్పిటల్‌ పక్కన, మిథాకలీ, అహ్మదాబాద్‌, గుజరాత్‌ 380006

అంగన్‌ రెస్టారెంట్‌ క్రాస్‌రోడ్‌, కలిబారి టెంపుల్‌ దగ్గర, రాజ్‌పథ్‌ రంగోలి రోడ్‌, అహ్మదాబాద్‌, గుజరాత్‌ 380058

8644 పయనీర్‌ బౌలేవార్డ్‌, ఆర్టేసియా, సిఎ 90701, యునైటెడ్‌ స్టేట్స్‌

శ్యామల్‌ మరియు భూమిక గురించి :

2003 సంవత్సరంలో స్థాపించబడిన శ్యామల్‌ & భూమిక నేడు భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైన్‌ షోరూమ్‌లలో ఒకటి. శ్యామల్‌ & భూమికలు భారతీయ పురాతన సంస్కృతి, వారసత్వం మరియు చరిత్రలను ప్రేరణగా తీసుకుని దాని చేనేత మరియు శిల్పకళా మెళుకువలను ఉపయోగించి ఆధునిక అవసరాలకు అనుగుణంగా అత్యద్బుత ఫ్యాషన్‌ డిజైన్‌ కలెక్షన్‌ తయారుచేస్తారు.

దుస్తులు మరియు ఫ్యాషన్‌పై ఉన్న అభిరుచితో భూమిక నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్లానజీ (నిఫ్ట్‌)లో ఫ్యాషన్‌ డిజైన్‌ను చేశారు. భారతదేశపు అతి విలువైన హస్తకళలు మరియు శిల్పకళా మెళుకువలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్‌ ప్రేమికులను అనుసంధించేందుకు  ‘ఇండియా టు ది వరల్డ్‌’ అనే దృష్టితో ఫ్యాషన్‌ను ఒక మాధ్యమంగా                    ఉపయోగించారు. అందుకు సామాజిక మాధ్యమాల్లో వారికున్న మూడు మిలియన్లకు పైగా ఉన్న ఫాలోయర్లే ప్రభల సాక్ష్యం.

Designer Bhumika, with the newly unveiled Couture Collection 2022, from Shyamal & Bhumika, India’s leading fashion house drawing inspiration from the rich Indian heritage & culture, today at Shyamal & Bhumika, Banjara Hills.

ప్రపంచవ్యాప్త పర్యాటక అనుభవం, ఆధునాతన స్త్రీవాదపు బలమైన మూలాల నుండి శ్యామల్‌ మరియు భూమికలు ప్రేరణ పొందారు. అలియా భట్‌, దీపికా పడుకోణె, ఇషా గుప్తా, జాక్వెలైన్‌ ఫెర్నాండేజ్‌, కత్రినా కైఫ్‌, కరీనా కపూర్‌ ఖాన్‌, మాధురి దీక్షిత్‌, సోనమ్‌ కపూర్‌, కంగనా రనౌత్‌, కాజల్‌ వంటి సెలబ్రిటీ నటీమణులు శ్యామల్‌ మరియు భూమిక రూపొందించిన డిజైన్లతో కనిపించారు.

భారతదేశం మరియు అంతర్జాతీయ మార్కెట్లలో క్లయింట్‌ ఆధారిత విశ్వసనీయ మార్కెట్‌ పెరుగుదలే వారి ప్రత్యేక శైలికి తార్కాణం. డైయింగ్‌ టెక్స్‌టైల్స్‌ & క్రాఫ్ట్స్‌లో స్థిరమైన నేర్పును ప్రదర్శించడం, భారతీయ సాంప్రదాయ కళా నైపుణ్యల మెళుకువలను ప్రోత్సాహించడం మరియు నమ్మడం ద్వారా ఫ్యాషన్‌ హౌస్‌ అనేకమంది హస్తకళాకారులకు ఉపాధిని  కల్పించింది మరియు కల్పిస్తూనే ఉన్నది.

మరింత సమాచారానికి దయ చేసి సంప్రదించండి: 9959154371 / 9963980259

Murthy

Tags

Related Articles

Back to top button
Close
Close