GossipsMOVIE NEWS

నితిన్ కి డ్యాన్స్ రాదు, మర్యాద తెలియదు..ఒరేయ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ అమ్మ రాజశేఖర్

Amma Rajasekhar said Nitin can't dance, he doesn't know manners.

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మ రాజశేఖర్.. దర్శకుడిగా కూడా రాణించారు. తెలుగులో అమ్మ రాజశేఖర్.. రణం, ఖతర్నాక్, టక్కరి లాంటి చిత్రాలు తెరకెక్కించారు. 

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మ రాజశేఖర్.. దర్శకుడిగా కూడా రాణించారు. తెలుగులో అమ్మ రాజశేఖర్.. రణం, ఖతర్నాక్, టక్కరి లాంటి చిత్రాలు తెరకెక్కించారు. వీటిలో రణం మాత్రమే హిట్ అయింది. మిగిలిన చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం అమ్మరాజశేఖర్ తెరకెక్కించిన ‘హయ్-ఫైవ్’ మూవీ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ చిత్రానికి అమ్మ రాజశేఖర్ దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. అయితే ప్రియ రిలీజ్ ఈవెంట్ లో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ హీరో నితిన్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నితిన్ ని ఏకంగా ఒరేయ్ నితిన్ అని సంభోదించారు. నితిన్ పై ఊహించని విధంగా అమ్మ రాజశేఖర్ విమర్శలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో నితిన్ టక్కరి చిత్రంలో నటించాడు. ఆ మూవీ బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. వేదికపై అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి నితిన్ ని పది రోజుల ముందే ఇన్వైట్ చేశా. వస్తానని మాట ఇచ్చాడు. కానీ రాలేదు. హ్యాండిచ్చాడు. నితిన్ కి నేను గురువు లాంటి వాడిని. కానీ నితిన్ నన్నే మరచిపోయాడు. 

కెరీర్ లో మనం ఎదిగినందుకు సహాయపడ్డవారిని మరచిపోకూడదు. కానీ నితిన్ నన్ను మరచిపోయాడు. నితిన్ కి డ్యాన్స్ రాదు. కానీ నేను డ్యాన్స్ నేర్పించి ఒక పొజిషన్ ఇచ్చా. కానీ నా ఫస్ట్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి నితిన్ రాలేదు. నితిన్ ప్రస్తుతం బిజీగా లేడు. ఇంట్లో ఉండి కూడా రాలేదు. కనీసం వీడియో బైట్ ఇవ్వమని అడిగా. అది కూడా చేయలేదు. నితిన్ కి మర్యాద కూడా తెలియదు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

నితిన్ మాత్రమే కాదు హీరోలందరికీ చెబుతున్నా.. మనకు సాయం చేసిన వాళ్ళని మరచిపోకూడదు. నితిన్ కి ఎవరు అవసరమో వాళ్ళ ఫంక్షన్ కి వెళతాడు. కానీ నన్ను ఇన్సల్ట్ చేశాడు. నితిన్ నాకు చాల క్లోజ్. కానీ నా సినిమా ఫంక్షన్ కి రాకుండా అప్సెట్ చేశారు. 

నువ్వు రాలేకుంటే రాను అని చెప్పు.. కానీ వస్తానని చెప్పి ఇలా ఇన్సల్ట్ చేయొద్దు. ఒరేజ్ నితిన్ నిన్ను చాలా నమ్మాను. కానీ ఇంట్లో ఉన్నా నువ్వు రాలేదు. నేను చాలా అప్సెట్ అయ్యా అంటూ అమ్మ రాజశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే వేదికపై ఎమోషనల్ అయ్యారు. అమ్మ రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ వివాదం అయ్యేలా ఉన్నాయి. 

Tags

Related Articles

Back to top button
Close
Close