MOVIE NEWSNEWS

Actor Vikram Hospitalized: చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో హీరో విక్రమ్ – ఆయనకు ఏమైందంటే?

ctor Vikram Hospitalized

తమిళ కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన విక్రమ్ (Vikram) ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నారు. ఆయనకు గుండెల్లో నొప్పి రావడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విక్రమ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు కోలీవుడ్ టాక్. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారట. అయితే… జ్వరంతో విక్రమ్ ఆసుపత్రిలో చేరారని, సీరియస్ ఏమీ కాదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండటంతో చియాన్ విక్రమ్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ వయసు 56 ఏళ్ళు. పాత్ర కోసం బరువు పెరగడం, అవసరం అయితే విపరీతంగా తగ్గడం ఆయనకు అలవాటు. ‘ఐ’ కోసం వెయిట్ బాగా తగ్గారు. అప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే… ఆ తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు.

Tags

Related Articles

Back to top button
Close
Close