MOVIE NEWS

“సమ్మతమే” చిత్రాన్ని పీపుల్స్ బ్లాక్ బస్టర్ గా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సమ్మతమే ‘పీపుల్స్ బ్లాక్ బస్టర్’ సక్సెస్ మీట్ లో టీమ్

Thanks to the audience who made "Sammatame" a People's Blockbuster: Sammatame Team in 'People's Blockbuster' Success Meet

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయిక. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పీపుల్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి హౌస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం, గోపీనాథ్ రెడ్డి, చాందిని చౌదరి, ప్రవీణ రెడ్డి డీవోపీ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సమ్మతమే చూసిన ప్రేక్షకులు మా కథే తీశారని, మా లైఫ్ లో కూడా ఇలా జరిగిందని అభినందించడం ఆనందంగా వుంది. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఈ కథని ఎంత బలంగా నమ్మారో అంతే బలంగా తీశారు. ఈ రోజు సినిమా అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా మొదట్లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. అయితే ఈవింగ్ షో తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అని తేలింది. సమ్మతమేకి కూడా అదే జరిగింది. మార్నింగ్ షో తర్వాత మిశ్రమ రివ్యూలు కొన్ని వినిపించాయి. ఈవినింగ్ సంధ్య థియేటర్ కి వెళ్లి చూస్తే మొత్తం హౌస్ ఫుల్. ప్రేక్షకులంతా విజల్స్ వేస్తూ ఒక మాస్ సినిమాని చూస్తున్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి డైలాగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ తో పాటు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కుటుంబమంతా కలసి ఎంజాయ్ చేశామని చెప్పడం మరింత ఆనందంగా వుంది. థియేటర్ కి వచ్చి సమ్మతమే చిత్రం చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కృతజ్ఞతలు. ప్రేక్షకుల వలనే సమ్మతమే పీపుల్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది ప్రేక్షకుల విజయం. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి, బన్నీ వాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సినిమాని గొప్పగా విడుదల చేశారు. మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. థియేటర్ల సంఖ్య పెరుగుతున్నాయి. యు ఎస్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిపీట్ ఆడియన్స్ వెళ్తున్నారు. రెస్పాన్స్, కలెక్షన్స్ అద్భుతంగా వున్నాయి. యు ఎస్ ఆడియన్స్ కి థాంక్స్. దర్శకుడు గోపీనాథ్, ప్రవీణ అమ్మ, చాందిని, మిగతా టీం అందరికి థాంక్స్. ముఖ్యంగా యుజీ టీం కి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సమ్మతమే చిత్రాన్ని అందరూ మన సినిమాగా ఆదరించారు. ఇంకా చూడని వాళ్ళు థియేటర్ కి వెళ్లి చూడండి. థియేటర్ ఎక్సపిరియన్స్ మిస్ కావద్దు” అని కోరారు.

దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సమ్మతమే’ అద్భుతమైన రెస్పాన్స్ తో  పీపుల్స్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఆనందంగా వుంది. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని ముందే అనుకున్నాను. నేను ఏదైతే నమ్మానో అది నిజమైయింది. కంటెంట్ ని బలంగా నమ్మాను. ఇది ప్రేక్షకుల విజయం. కేవలం మౌత్ టాక్ వలనే సమ్మతమే  పీపుల్స్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా ప్రతి ఒక్కరూ బావుందని చెప్పడం వలనే ఇది సాధ్యమైయింది. కిరణ్ తో ఎప్పుడూ పని చేసినట్లు వుండదు. మేము ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుకుంటాం. మొదటి సినిమాకి మనల్ని అర్ధం చేసుకునే హీరో దొరకడం ఆనందం. నా టీమ్ అంతా నన్ను ఎప్పుడూ నాలుగైదు హిట్లు కొట్టిన దర్శకుడిలానే చూశారు. ఎప్పుడూ కొత్త దర్శకుడనే భావన కల్పించలేదు. అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన టీమ్ కి థాంక్స్. సినిమా చూసిన ప్రేక్షకులు అనుభవం గల దర్శకుడు తీసినట్లుగా వుందని చెబుతున్నారంటే దానికి కారణం నా టీమ్. డబ్బులుంటే ఎవడైనా సినిమా తీస్తాడు. కానీ హిట్ కొట్టడం ముఖ్యం. సొంత డబ్బులతో సినిమా తీసి, సూపర్ హిట్ కొట్టడం ఆనందంగా వుంది. మాకు ఎంతో సహకరించిన మీడియాకి ధన్యవాదాలు. పీఆర్వో వంశీ-శేఖర్ గారు, తేజస్వీ, సుధాకర్ గారికి, మా డిజిటల్ టీంకి థాంక్స్. సమ్మతమే చిత్రాన్ని ప్రేక్షకులు పీపుల్స్ బ్లాక్ బస్టర్ చేశారు. మాకు ఇంతపెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి కృతజ్ఞతలు. ప్రేక్షకుల విలువైన సమయం వారు చెల్లించే ప్రతి రూపాయి చాలా విలువైనది. వారి పట్ల గౌరవం భాద్యత వుంది. ప్రేక్షకులు పది రూపాయిలు పెడితే వందరూపాయిల వినోదం పంచడానికే ప్రయత్నిస్తా” అన్నారు.

చాందిని చౌదరి మాట్లాడుతూ.. ‘సమ్మతమే’ చిత్రాన్ని  పీపుల్స్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ప్రేక్షకులే దేవుళ్ళు. మా సినిమాని మనస్పూర్తిగా సమ్మతించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ కథ విన్నప్పుడు శాన్వి పాత్ర చాలా నచ్చింది. ఈ రోజు ప్రేక్షకులకు కూడా నచ్చడం ఆనందంగా వుంది. చాలా మంది అమ్మాయిలు కాల్స్ చేసి నన్ను నేను చుసుకున్నట్లు వుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు గోపీనాథ్ గారికి థాంక్స్. హీరో కిరణ్ గారు, దర్శకుడు గోపీనాథ్, నిర్మాత ప్రవీణ గారు మిగతా టీం ఈ సినిమా కోసం ఎక్కడా రాజీపడకుండా పని చేశారు. ఈ రోజుల్లో థియేటర్ లో హిట్ కొట్టడం అంత సులువు కాదు. సమ్మతమే ఇంత పెద్ద థియేటర్ సక్సెస్ కావడం కలా నిజమా అన్నట్లుగా వుంది. చాలా రోజుల తర్వాత కంటినిండా నిద్రపోతున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ప్రేక్షకుల విలువైన సమయాన్ని ” తెలిపారు.

నిర్మాత ప్రవీణ రెడ్డి మాట్లాడుతూ.. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మేము ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని అందించారు. మన సినిమా అనుకోని అందరూ అద్భుతంగా ఆదరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. మీ అబ్బాయి సినిమాని అద్భుతంగా తీశారని అందరూ చెబుతుంటే చాలా ఆనందంగా వుంది. సినిమాలో పని చేసిన కిరణ్ గారు, చాందిని గారు, కెమరామెన్ సతీస్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, ఎడిటర్ విప్లవ్ మిగతా టీం అందరికీ ధన్యవాదాలు. మాకు చాలా సపోర్ట్ గా నిలిచారు. మా సినిమాని ఇంతలా ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకి మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు తెలుపుతున్నాను.

డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ: నా మొదటి సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం ఆనందంగా వుంది. సినిమాకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. నిర్మాతలు, దర్శకుడు, హీరో కిరణ్ అబ్బవరం, చాందిని, మా యూనిట్ అందరికీ థాంక్స్. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చింది ప్రేక్షకులకు కృతజ్ఞతలు” తెలిపారు.

Pro: Vamsi – Shekar & Madhu

Tags

Related Articles

Back to top button
Close
Close