
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా జూన్ 26న మ్యాచో హీరో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
Macho hero Gopichand 'Pakka Commercial' pre-release event on June 26 with megastar Chiranjeevi as the chief guest.
Macho hero Gopichand 'Pakka Commercial' pre-release event on June 26 with megastar Chiranjeevi as the chief guest.

వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకున్న జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ వాస్ నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మేజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 26న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ వేడుక ఘనంగా జరగనుంది. చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు. అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేసారు. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.
నటీనటులు:
గోపీచంద్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు
టెక్నికల్ టీం:
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్ – జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్
నిర్మాత – బన్నీ వాస్
దర్శకుడు – మారుతి
ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్
మ్యూజిక్ – జకేస్ బీజాయ్
సహ నిర్మాత – ఎస్ కే ఎన్
లైన్ ప్రొడ్యూసర్ – బాబు
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ – సత్య గమిడి
ఎడిటింగ్ – ఎన్ పి ఉద్భవ్
సినిమాటోగ్రఫి – కరమ్ చావ్ల
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్