MOVIE NEWS

Karthikeya-2 Teaser Will Be Unveiled on June 24th.

Karthikeya-2 teaser will be unveiled on June 24th.

One of the most awaited sequels this year is Nikhil’s Karthikeya-2. Chandu Mondeti has taken Karthikeya to a new level of the expedition to a hidden city Dwaraka. Motion poster, Characters introducing posters created enough buzz and hyped up the expectations on this film.

Makers unveiled a teaser announcement video where Nikhil, Anupama Parameswaran, Srinivas Reddy, and Harsha Chemudu were seen in their respective getups in the aftermath of the fight scene setup.

Peoples Media Factory and Abhishek Pictures are bankrolling this crazy project while Kalabhairava is composing the music. Karthikeya-2 is scheduled to be released on July 22nd worldwide.

జూన్ 24న ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌ ‘కార్తికేయ 2’ టీజర్.. 

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ జూన్ 24న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇచ్చారు మేకర్స్. మోషన్ పోస్ట‌ర్ లో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం. శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని మోషన్ పోస్ట‌ర్ రూపంలో ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది కార్తికేయ 2. 

నటీనటులు: 

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు

టెక్నికల్ టీం: 

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం – చందు మెుండేటి

బ్యాన‌ర్: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌

కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్లనిర్మాత‌లు: టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌

మ్యూజిక్: కాలభైరవ

సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని

ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Tags

Related Articles

Back to top button
Close
Close