
Sithara Entertainments and Fortune Four Cinemas join hands for Panja Vaisshnav Tej’s next, film formally launched
Sithara Entertainments and Fortune Four Cinemas join hands for Panja Vaisshnav Tej's next, film formally launched

*పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో చిత్రం వైభవంగా ప్రారంభం:
* వైష్ణవ్ తేజ్ మాస్ అవతారం ఈ చిత్రం
*కథానాయికగా ‘శ్రీ లీల‘
*దర్శకుడు గా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం
*ఆకట్టుకుంటున్న ప్రచార చిత్రం, సంభాషణలు, నేపథ్య సంగీతం
*హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో నేటి (22-6-2022) ఉదయం 11.16నిమిషాలకు ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభం

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో రూపు దిద్దుకోనున్న చిత్రం నేడు ముహూర్తం జరుపుకుంది. హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో నేటి (22-6-2022) ఉదయం 11.16 నిమిషాలకు ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభం అయింది.
సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కళ్యాణ్ (అనగనగా ఒక రాజు) లు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు. క్లాప్ హీరో సాయిధర్మ తే జ్ ఇవ్వగా,కెమెరా స్విచాన్ దర్శకుడు సుధీర్ వర్మ చేశారు. స్క్రిప్ట్ ను నిర్మాత ఎస్.నాగవంశీ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ కు అందించారు.
చిత్రం ముహూర్తం సందర్భంగా ఈ చిత్రానికి సంభందించిన ఓ ప్రచారచిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. దీన్ని పరికిస్తే…”
“రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే
ఎట్టుంటదో సూస్తావా…” అని చిత్రంలో ప్రతినాయక పాత్ర హెచ్చరిక గా అంటే…..
“ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా…. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు… సూస్కుందాం రా….
తలలు కోసి సేతికిస్తా నాయాలా…!” అంటూ కథానాయకుడు మరింత గా హెచ్చరించడం కని (విని) పిస్తుంది. పదునైన ఈ సంభాషణలకు సమకూర్చిన నేపథ్య సంగీతం మరింత పౌరుషాన్ని పెంచినట్లయింది. 2023 సంక్రాంతి కి చిత్రం విడుదల అని కూడా కనిపిస్తుంది. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. అంతేకాదు భారీస్థాయిలో నిర్మాణం జరుగుతుందనిపిస్తుంది ఈ వీడియోను పరికిస్తే.
వైష్ణవ్ తేజ్ సరసన కథానాయికగా ‘శ్రీ లీల‘ నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు గా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం
అవుతున్నారు. వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం. పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక,నిర్మాతలు.
చిత్రం రెగ్యులర్ షూటింగ్,అలాగే చిత్రానికి సంబంధించిన ఇతర నటీ నటు లు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.
పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య.
రచన- దర్శకత్వం: శ్రీకాంత్.ఎన్.రెడ్డి
