MOVIE NEWS

ముసలోడికి దసరా పండగ’ ఈవివికి అంకితం!

రాజీనాయుడు, సీతమ్మవాళ్లె ఆశీస్సులతో……. రమణ ఫిలిమ్స్ పతాకంపై రమణవాళ్లె నిర్మించిన ద్విబాషా చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’. నాజర్ ప్రదాన పాత్రలో నటించగా సీతమ్మ వాకిట్లో ఫేమ్ అంజలి, నువ్వునేను ఫేమ్ అనిత, కోవైసరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. డి. మనోహర్ దర్శకుడు. ఈ చిత్రం పోస్టర్, ట్రైలర్ ను ఇటీవల నాజర్ విడుదల చేసారు.

నాజర్ మాట్లాడుతు “ఇందులో నా క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ట్రైలర్ బావుంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ “ప్రేక్షకుడు రెండు గంటలసేపు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. ఆడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. త్వరలో సినిమా రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని స్వర్గస్తులు, నాకు తండ్రి సమానులైన ప్రముఖ దర్శకులు EVV సత్యనారాయణ గారికి అంకితం ఇస్తున్న” అని అన్నారు.
నటీనటులు: నాజర్(బాహుబలి ఫేమ్)
అంజలి(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్)
అనిత (నువ్వునేను ఫేమ్)
కోవై సరళ, శరణ్య
సత్య తదితరులు.

సాంకేతిక నిపుణులు:
సాహిత్యం:హనుమాయన్
బండారు, మాటలు: M.వెంకట్
సంగీతం:D.ఇమాన్
ఎడిటింగ్: B.మధు
కెమెరామేన్:V.లక్షీ పతి
నృత్యం: కళ్యాణ్, దినెష్
దర్శకత్వం:D.మనోహర్
బ్యానర్: “రమణ ఫిలింస్”
ప్రొడక్షన్:రమణవాళ్లె”
పీఆర్ఓ: మధు వెల్లూరు.

Related Articles

Back to top button
Close
Close