MOVIE NEWS

విడుదల కు సిద్దమైన “నిన్నే చూస్తు”

వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్లో, శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), హీరోహీరోయిన్లుగా,కే. గోవర్ధనరావు దర్శకత్వంలో, పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మాతగా, నిర్మించిన “నిన్నే చూస్తు” చిత్రం, ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా

సీనియర్ నటులు సుమన్, సుహాసిని, బాను చందర్ లు మాట్లాడుతూ..యూత్ సినిమాలను తీస్తూ బోల్డ్ కంటెంట్ కు ప్రాధాన్యత ఇస్తూ సొమ్ము చేసుకుంటున్న సినిమాలకు భిన్నంగా ఈ దర్శక, నిర్మాతలు మంచి కాన్సెప్ట్ ఉన్న కుటుంబ కథా చిత్రాన్ని సెలెక్ట్ చేసుకొని తీస్తున్న వీరిని ఆఫ్రిసియేట్ చెయ్యాలి. సినిమా బాగా వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఆన్నారు.

నిర్మాత హేమలత రెడ్డి గారు మాట్లాడుతూ..కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో ఈ చిత్రాన్ని చిత్రీకరించాము.ఇంతకుముందు ఈ చిత్రం రఫ్ ఎడిటింగ్ చూశాము. దానికి చాలా మంది ఆఫ్రిసియేట్ చేశారు.అయితే నెను లేడీ అనుకుని ఎంకరేజ్ చేశారని అనుకున్నాను.అయితే కంటెంట్ చూసి బాగుందని ఆఫ్రిసియేట్ చేశారు. ప్రమోషన్ పరంగా ఏ విధమైన సహాయం కావాలన్నా సహాయం చేస్తామని అన్నారు. అలాగే సుమన్ గారు,సుహాసిని గార్లు చాలా బిజీ గా ఉన్నా వారి పనులను పోస్ట్ ఫోన్ చేసుకుని వైజాగ్ షెడ్యూల్స్ లో చాలా హెల్ప్ చేశారు.నా బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను సపోర్ట్ చేసిన వీరిద్దరికీ ధన్యవాదాలు. అలాగే సుహాసిని గారు మాకిచ్చిన  చిన్న చిన్న టిప్స్ మా సినిమాకు ఎంతో ఉపయోగ పడ్డాయి.వీరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.కోవిడ్ కారణంగా ఈ సినిమా డిలే అయ్యింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో డీఫ్రెంట్ ప్రమోషన్ లో టీజర్,ట్రైల్సర్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నామని, ఖచ్చితంగా మా సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని తెలిపారు.

చిత్ర దర్శకుడు కె గోవర్ధనరావు మాట్లాడుతూ.. నిర్మాత మొదట నాకిచ్చిన ప్యాడింగ్ లిస్ట్ చూసి ఇంత మంది సీనియర్ యాక్టర్స్ ను నేను డీల్ చేయగలనా లేదా భయపడ్డాను.సుమన్, సుహాసిని,బాను చందర్, షియాజి సిండే లు మాతో కలసి మెలసి హ్యాపీగా పని చేశారు.అలాగే మాకేమైనా కన్ఫ్యూజన్ వున్నా కూడా వాటిని క్లియర్ చేశారు. ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని చెప్పే ప్రయత్నాన్ని ఈ సినిమా ద్వారా చేశామని, నాకిలాంటి మంచి ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత హేమలత రెడ్డి గారికి కృతజ్ఞతలు అని  తెలియజేశారు. 

నటీనటులు:
శ్రీకాంత్ గుర్రం, బుజ్జి(హేమలతా రెడ్డి), సుహాసిని, సుమన్, సాయాజి షిండే,  భానుచందర్, కిన్నెర, జబర్దస్తు మహేష్ తదితరులు.

సాంకేతిక నిపుణులు
ప్రొడ్యూసర్: పోతిరెడ్డి హేమలత రెడ్డి,
దర్శకత్వం కె గోవర్ధనరావు.
సంగీతం: రమణ్ రాతోడ్,
ఎడిటర్ : నాగిరెడ్డి,  
కెమేరా : ఈదర ప్రసాద్,
పి.ఆర్.ఓ : మధు వి ఆర్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close