MOVIE NEWS

ఆచార్య గురించి సిద్ద మాటల్లో

సినిమా లాంచింగ్ అయినప్పుడు ఆచార్య లో నా పాత్ర లేదు నేను నిర్మాతగా ఈ ప్రాజెక్టు లోకి ఎంటర్ అయ్యాను తప్ప నా క్యారెక్టర్ ఉంటుంది అని అస్సలు ఊహించలేదు కానీ తర్వాత సినిమాలో చిన్న పాత్ర 15 నిమిషాల నిడివిగల పాత్ర చేయమని చెప్పారు.నాన్నగారితో సినిమా కావడంతో వెంటనే ఓకే చేశాను ఆ తర్వాత నా పాత్ర పెరిగడంతో అది కాస్త 45 నిమిషాలకు చేరింది.దాంతో నేను సెకండాఫ్ అంతా కనిపిస్తాను

యు.వి.క్రియేషన్స్ లో మిర్చి వచ్చినప్పటినుంచి కొరటాల శివతో సినిమా చేద్దామని అనుకున్నాం ఈ చిత్రంతో సెట్ అవ్వడంతో ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అయ్యింది. ఈ 20 ఏళ్లలో మా నాన్నను చూసి ఏం నేర్చుకున్నానో తెలియదు కానీ “ఆచార్య” చిత్రీకరణ కోసం మారేడుమిల్లి అడవులలో ఉన్న ఇరవై రోజులు ఇద్దరం ఒక కాటేజ్ లో ఉన్నాం. కలిసి వ్యాయామం, భోజనం చేశాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఇద్దరి మధ్య ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నా జీవితంలో మరచిపోలేని రోజులవి. .సినిమా విజయం సాధిస్తే ఎలా ఉండాలి? పరాజయం పాలైతే ఎలా ఉండాలి? అనే విషయాలు నాన్న నుంచి నేర్చుకున్నాను

రాజమౌళి గారు బొమ్మరిల్లు ఫాదర్ లాంటి వారు ఆయన సినిమా అంగీకరించామంటే అది పూర్తయ్యేవరకు ఆర్టిస్ట్ చేయి వదలడు. కానీ సిద్ధ పాత్ర గురించి కొరటాల శివ గారు రాజమౌళి గారికి చెప్పారు.ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను రాజమౌళిగారు గుర్తించి .ఆర్ఆర్ఆర్ లో ఉన్న నన్ను నువ్వు “ఆచార్య” చేస్తే బావుంటుందని రాజమౌళి డేట్స్ ఇచ్చారు. మా నాన్న మీద గౌరవంతో అమ్మ సురేఖ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆచార్య చేసేందుకు నాకు అవకాశం ఇచ్చారు రాజమౌళి గారు. నాన్నతో కలిసి ఈ సినిమాలో పూర్తిస్థాయిలో నటించడం చాలా ఆనందంగా ఉంది నాన్నతో కలిసి నటించే ఇలాంటి అద్భుతమైన అవకాశం వస్తుందో రాదో తెలియదు..ఇలాంటి అవకాశం కల్పించిన రాజమౌళి గారికీ,కొరటాల శివకు రుణపడి ఉంటాను.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close