MOVIE NEWS

నటరాజ్‌ బిగ్ బాస్‌ లో ఉన్నా బయట నుంచి అందరూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అన్‌స్టాపబుల్‌ బాలయ్యబాబులాంటి బడాబడా హీరోలకి జీ ఛానల్‌, మా ఛానల్‌, ఈటీవీ, జెమినిలాంటి ఛానల్స్‌లోని పెద్ద పెద్ద షోలకి ఎన్నో ఏళ్లు గా కొరియోగ్రఫీ చేస్తూ పేరు తెచ్చుకున్నాడు నటరాజ్‌ మాస్టర్‌. ఈరోజు అతని పుట్టినరోజు సందర్భంగా అతని శిష్యగణం అతని ద్వారా డ్యాన్‌ నేర్చుకున్నవాళ్లు, అతని సాయం పొందిన వాళ్లు నటరాజ్‌ బిగ్ బాస్‌ లో ఉన్నా బయట నుంచి అందరూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నటరాజ్‌ భార్య నీతూ మాస్టర్‌, కూతురు బేబీ లక్ష్య నటరాజ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదంతా ఇలా ఉండగా బిగ్‌బాస్‌ ఓటీటీలోని ఇంటి సభ్యుల మధ్య పోటీ పెంచుతూ, కలిసి ఆట ఆడుతున్నవారి మధ్య పోటీ పెంచి వేడి కలిగిస్తూ, విడిపోయి గొడవలు పడుతున్న సభ్యుల మధ్య పెంచిన గొడవలు చల్లార్చే టాస్క్‌లు పెడుతూ ఆటని మంచి రసవత్తరంగా ఆడిస్తున్నాడు. క్యారెక్టర్‌ ఉన్నవాడైనా సరే బిగ్‌బాస్‌ టాస్క్‌లతో ఓర్పు, సహనం వదిలేసి రియల్‌ కటౌట్‌ పక్కన పెట్టి చెట్టుకింద కెళితే గంధర్వుడు కాస్త రాక్షసుడిలా మారినట్లు మారుతున్నారు. కానీ గూగుల్‌ ఓటింగ్‌లలో జరిగే ఫేక్‌ ఓటింగ్‌లనే బయట అందరు గుడ్డిగా నమ్మి ఫాలో అవుతున్నా, ఆ రియల్‌ ఓట్లు మటుకు ఆ బిగ్‌బాస్‌కే తప్ప మరెవరికీ తెలియదు అనేదే సత్యం. అతని లెక్కే చివరికి గెలుస్తుంది అనేది వాస్తవం. బాగా కంటెంట్ ఇచ్చే వారు నలుగురు లేదా ఐదుగురు మాత్రమే అందులో నటరాజ్ ఒకడు . ఇలా కంటెంట్ ఇచ్చే నటరాజ్ లాంటి వాళ్లపై కడుపు మంట మీద బయట పెయిడ్ కామెంట్స్ రాసే వర్గం చెడు చల్లుతూ బిజీగా ఉన్నారు.బిగ్ బాసూ నీ రూటే వేరయా.

Related Articles

Back to top button
Close
Close