MOVIE NEWS

ప్రేక్షకులిచ్చిన దైర్యంతో  “రెడ్డిగారింట్లో రౌడీయిజం”  సీక్వెల్ కు వెళ్తున్నాం.. చిత్ర హీరో ర‌మ‌ణ్

సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్,ర‌మ‌ణ్, వర్ష విశ్వనాధ్, ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, నటీనటులుగా ఎం.ర‌మేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వంలో  కె.శిరీషా ర‌మ‌ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ .  ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింప బడుతూ ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా

హీరో ర‌మ‌ణ్  మాట్లాడుతూ..నాకు యాక్టింగ్ అనేది  చిన్నప్పటి కల. 15 సంవత్సరాల నుంచి కష్టపడిన నాకు సిరి మూవీస్ లో చేసిన  “రెడ్డిగారింట్లో రౌడీయిజం” ఇంత సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇన్ని పెద్ద  సినిమాల మధ్య వచ్చిన మా సినిమాను ఆదరించి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము రిలీజ్ చేసిన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింప బడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదట మంచి సినిమా చెయ్యాలి. అనుకున్నప్పుడు దర్శకుడు నాకు మంచి సబ్జెక్ట్ చెప్పాడు. కథ నచ్చడంతో  ఈ సినిమాను ఏపీ, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, గోవా మహారాష్ట్ర ఐదు రాష్ట్రాలలో షూట్  చేశాము.అయితే ఎక్కువ భాగం  రాయలసీమ ప్రాంతంలోని కుప్పం ఏరియాలో షూట్ చేశాము. ఫస్ట్ సినిమాకే ఇంత మంచి ఆదరణ లభించడం చాలా సంతోషంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ గారు ఎక్స్ట్రార్డినరీ సాంగ్స్ ఇచ్చారు  వారికి మా ధన్యవాదాలు. శ్రీ‌వ‌సంత్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌,ఏ.కె. ఆనంద్‌ సినిమాటోగ్ర‌ఫీ ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్ మా సినిమా కోసం చాలా కష్టపడ్డారు.మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “రెడ్డి గారింట్లో రౌడీయిజం” సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.అలాగే ఇంకా చూడనివారు మా సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరుచున్నాం. ప్రేక్షకులు మా కిచ్చిన సపోర్ట్ తో మేము త్వరలో  “రెడ్డిగారింట్లో రౌడీయిజం” పార్ట్ 2 కూడా తీయబోతున్నాం అని అన్నారు.

చిత్ర దర్శకుడు గోపి మాట్లాడుతూ ..ప్రతి ఒక్క మనిషిలోను దేవుడు ఉన్నాడు. మానవ సేవే మాధవ సేవ. కులం, మతం కంటే… ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే గొప్ప మానవత్వం అనే సందేశంతో సున్నితమైన కథను తెరకెక్కించాలని ర‌మ‌ణ్ గారికి ఈ కథ చెప్పగానే సింగిల్ సిటింగ్ లో సినిమా కథను ఓకే చేశాడు.హీరో కావాలి అనుకునే తనకు 15 సంవత్సరాల కలను నెరవేర్చుకుంటే ఇందులో మాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించి మాకు జీవితకాలం కలను నెరవేర్చాడు. వారికి మా ధన్యవాదాలు. మేము ఈ సినిమాను ఎక్కువగా కుప్పం లోనే షూట్ చేశాము  ప్రతి ఒక్కరు మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. హీరో ర‌మ‌ణ్ గారు ఈ సినిమాలో వన్ మ్యాన్ షో లా అద్భుతంగా నటించాడు. హీరోయిన్లు కూడా చాలా చక్కగా నటించారు. ప్రముఖ దివంగత సంగీత దర్శకుడు  చక్రి తమ్ముడు మహిత్ నారాయణ గారు చక్కని పాటలు అందించాడు.ప్రతి ఒక్క సాంగు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమాస బాగా వచ్చింది.కుప్పం లోని ఎస్ఆర్ఎం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది.మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

మరో దర్శకుడు రమేష్ మాట్లాడుతూ ..మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా సినిమా పాటలను హీరో రామ్ చరణ్ గారు లాంచ్ చేయడంతో మా సినిమా నెక్ట్స్ లెవల్ కు వెళ్ళింది.అందుకు వారికి మా ధన్యవాదాలు. అలాగే డైరెక్టర్స్ వి.వి.వినాయక్, వి.యన్ ఆదిత్య ,హీరోలు శ్రీకాంత్,సప్తగిరి ఇలా ఇండస్ట్రీలో చాలా మంది మాకు సపోర్ట్ చేశారు.వారందరికీ మా ధన్యవాదాలు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో హీరో పక్కింటి కుర్రాడు లాగా అద్భుతంగా నటించాడని, ఇండస్ట్రీ వారు  ఫోన్ చేస్తూ ఆఫ్రిసియేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పాటలు బాగుంటేనే ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ చేస్తారు. అలాంటిది మా పాటలను ఆదిత్య మ్యూజిక్  లో రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే చిన్న హీరో , పెద్ద హీరో అని తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ప్రజలు ఆదరిస్తారని రెడ్డిగారింట్లో రౌడీయిజం సినిమా నిరూపించింది. ఒక కుటుంబానికి తీవ్ర నష్టం కలిగించిన వ్యక్తిని చంపాలని తిరుగుతున్న వీరికి అనుకోకుండా ఒకరోజు ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తే అప్పుడు వారు తనని చంపకుండా మానవత్వంతో ట్రీట్మెంట్ ఇప్పించి కాపాడతారు.అలా ఎందుకు కాపాడవలసి వచ్చింది? దానికి గల కారణమేంటి వంటి విషయాన్ని  మనిషి యొక్క నైతిక విలువలను తెలియజేస్తూ తీసిన చిత్రమే “రెడ్డిగారింట్లో రౌడీయిజం”.ఈ సినిమా విడుదలైన ప్రతి థియేటర్ లోను విజయవంతంగా ప్రదర్శింప బడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నటీనటులు, టెక్నీషియన్లకు మా ధన్యవాదాలు. .ఇకనుండి నేను తీసే ప్రతి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉండేవిధంగా సినిమా తీస్తాను. ముఖ్యంగా మా సినిమాను ఆదరరిస్తున్న కుప్పం ప్రజలకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాం అన్నారు

హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇందులో నేను లీడ్ రోల్ గా చేశాను .హీరో ర‌మ‌ణ్ గారు నటనలో ఎంతో అనుభవమున్న నటుడులా చాలా చక్కగా నటించారు. ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ ,ఎమోషన్ సీన్స్ అన్నీ చాలా చక్కగా కుదిరాయి. విడుదలైన ప్రతిచోటా మమ్మల్ని మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలుఅన్నారు

నటీనటులు:
ర‌మ‌ణ్‌, ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వర్ష, వినోద్ కుమార్‌, ర‌చ్చ ర‌వి, మిర్చి మాధ‌వి, జూనియ‌ర్ బాల‌కృష్ణ‌, శంక‌ర్‌, కృష్ణ‌, ప్ర‌కాష్ అడ్డా, వెంక‌ట్‌, సిద్ధు తది తరులు

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం. ర‌మేష్‌, గోపి
నిర్మాత‌:  కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి
బ్యాన‌ర్‌:  సిరి మూవీస్‌
స‌మ‌ర్ప‌ణ‌:  కొరివి పిచ్చిరెడ్డి, స‌ర‌స్వ‌తి
రిలీజ్‌:  స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్‌
సంగీతం: మ‌హిత్ నారాయ‌ణ్‌
బ్యాగ్రౌండ్ స్కోర్‌: శ్రీ‌వ‌సంత్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎ.కె. ఆనంద్‌
ఎడిటింగ్‌: శ్రీ‌నివాస్ పి. బాబు, సంజీవ‌రెడ్డి
ఆర్ట్‌: న‌రేష్ సిహెచ్‌.
ఫైట్స్‌: అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు
కొరియోగ్ర‌ఫీ:  చందు రామ్‌, రాజ్ పైడి, సాయిశివాజీ

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close