MOVIE NEWS

నా సినిమాలు నాకే పోటీ – నంద‌మూరి బాల‌కృష్ణ‌

నా సినిమాలు నాకే పోటీ – నంద‌మూరి బాల‌కృష్ణ‌

అభిమానుల సేవా కార్య‌క్ర‌మాలు చూస్తుంటే గ‌ర్వంగా వుంది
తెలుగువారే కాదు ప్ర‌పంచంలోని అంద‌రూ వేయినోళ్ళ తో  పొగిడారు.
– అఖండ వంద‌రోజుల వేడుక‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌

బాల‌య్య‌ గారి అభిమానుల‌తోపాటు ఇత‌ర హీరోల అభిమానులూ నిజాయితీగా  విజ‌యాన్ని చేకూర్చారు- బోయ‌పాటి శ్రీ‌ను
మా జ‌ర్నీ ఇలాగే వుండాల‌ని భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నా- బోయ‌పాటి శ్రీ‌ను

భార‌త చ‌ల‌న చిత్ర‌రంగానికి దిక్చూచి అఖండ విజ‌యం – నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అఖండ‌` చిత్రం 20 థియేట‌ర్ల‌లో వంద రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబ‌ర్ 2న విడుద‌లై క‌రోనా స‌మ‌యంలోనూ ఊహించ‌ని విజ‌యాన్ని సాధించ‌డం బాల‌కృష్ణ‌లోని ప్ర‌త్యేక‌త‌గా అభిమానులు తెలియ‌జేస్తున్నారు. అందుకే వంద‌రోజుల వేడుక‌ను క‌ర్నూలులో జ‌ర‌పాల‌ని చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది. ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించారు.
అఖండ వంద రోజుల‌ కృత‌జ్ఞ‌త‌ స‌భ శ‌నివారం రాత్రి క‌ర్నూలు న‌గ‌రంలోని ఎస్‌టి.బి.సి. కాలేజ్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఆనందోత్సాహాల‌తో క‌ర్నూలు, ఎమ్మిగ‌నూరు, ప‌త్తికొండ‌, ఆదోనీ, విజ‌య‌వాడ‌, ఢిల్లీ నుంచి సైతం పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. చిన్న‌పిల్ల‌ల నుంచి మ‌హిళ‌లు, పెద్ద‌లు సైతం `జైబాల‌య్య‌` అంటూ నిన‌దించారు.

ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఇంత‌మంది జ‌నాల‌మ‌ధ్య వంద‌రోజుల వేడుక జ‌రుపుకుని ఎన్ని సంవ‌త్స‌రాలైందో. మేం ఈ సినిమాను ప్రారంభించిన‌ప్పుడు సింహా, లెజెండ్‌కు మించి వుండాల‌ని మేం అనుకోలేదు. క‌రోనా వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు జ‌ర‌గ‌డం మ‌ర‌లా ఆగిపోవ‌డం జ‌రిగింది. విడుద‌ల‌య్యాక అఖండ విజ‌యాన్ని ప్రేక్ష‌కులు, అభిమానులు ఇచ్చారు. సినిమా అనేది అవ‌స‌రంగా భావించారు. నాన్న‌గారి సినిమాలు ఆలోచించేవిగానూ, వినోదంగానూ వుండేవి. ఈ అఖండ సినిమా మ‌న హైoదవ  స‌నాత‌న ధ‌ర్మాన్ని మ‌రోసారి గుర్తుచేసేట్లుగా వుంది.  ప్ర‌కృతి, ధ‌ర్మం, ఆడ‌వారి జోలికి వ‌చ్చి ఎటువంటి అపాయం క‌లిగించినా భ‌గ‌వంతుడు ఏదో రూపంలో మ‌నిషిలో ప్ర‌వేశించి అవ‌ధూత‌గా మార‌తాడు. ఆ పాత్ర వేయించి నా ద్వారా ద‌ర్శ‌కుడు సందేశం ఇచ్చాడు. అఖండ సినిమాను మ‌న తెలుగువారేకాదు ప్ర‌పంచంలోని అంద‌రూ వేయినోళ్ళ తో పొగిడారు. మీ ద్వారా ఇంత‌టి అఖండ విజ‌యాన్ని ఇచ్చిన భ‌గ‌వంతునికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా. కృషివుంటే మ‌నుషులు ఋషుల‌వుతారంటారు. అలా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను, నేను క‌థ మూలాల్లోకి వెళ్ళి మంచివి చేయాల‌ని త‌ప‌న‌తో కృషి చేస్తుంటాం. ద‌ర్శ‌కుడు ఏ క‌థ‌యినా క‌ట్టె, కొట్టె, తెచ్చె అనే మూడు ముక్క‌ల్లో చెబుతారు. బోయ‌పాటి ఉన్నాడ‌న్న ధైర్యంతో సినిమా చేస్తాను. ప్ర‌తి న‌టుల్లోనూ హావ‌భావాలు ఎలా రాబ‌ట్టాలో ఆయ‌న‌కు బాగా తెలుసు. నేను కృత్రిమైన సినిమాలు భైర‌వ‌దీపం, ఆదిత్య 369 చేశాను. కానీ అఖండ వంటి స‌హ‌జ‌మైన సినిమా చేసి అఖండ విజ‌యాన్ని సాధించ‌డం ప్రేక్ష‌కుల అభిమాన‌మే కార‌ణం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close