
MOVIE NEWS
నితిన్ మాచర్ల నియోజకవర్గం భారీ షెడ్యూల్ పూర్తి
నితిన్ హీరోగా ఎం ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న మాచర్ల నియోజకవర్గం భారీ షెడ్యూల్ పూర్తి
ప్రస్తుతం హీరో నితిన్ రాబోయే చిత్రం మాచర్ల నియోజకవర్గం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ప్రముఖ ఎడిటర్ MS రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను
ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
అనల్ అరసు మాస్టర్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను రూపొందించారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ డ్యాన్స్ పూర్తయింది.
ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి.