
ప్రతి మహిళా గర్వపడే సినిమా `ఇ.టి.
ప్రతి మహిళా గర్వపడే సినిమా `ఇ.టి.- ప్రియాంకా మోహన్ ఇంటర్వ్యూ
కన్నడ, తమిళ చిత్రాల్లో నటించిన ప్రియాంకా మోహన్ తెలుగులో నానితో ‘గ్యాంగ్ లీడర్’, శర్వానంద్‌తో శ్రీకారం చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు తనకు పెద్దగా పేరు రాకపోయినా తమిళంలో శివకార్తియేషన్ తో చేసిన ` డాక్టర్` సినిమా చక్కటి గుర్తింపు తెచ్చింది. తెలుగులోనూ అది విడుదలైంది. ఇప్పుడు తమిళంలో `సూర్యతో ఇ.టి. (ఎవరికీ తలవంచడు) సినిమా చేసింది. సూర్య నటించిన యాక్షన్ థ్రిల్లర్ `ఇటి`. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10 విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె మీడియాలో పలు విషయాలు పంచుకుంది.