
మెగా154లో హీరోయిన్ గా శ్రుతి హాసన్
మెగాస్టార్ చిరంజీవి హీరో గా బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న మెగా154లో హీరోయిన్ గా శ్రుతి హాసన్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్ దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందుతోన్న మెగా 154 చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం అన్ని కమర్షియల్ హంగుల తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.
మెగా154 కోసం ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మహిళా దినోత్సవం సందర్భం గా హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపికచేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా “ఈ మహిళా దినోత్సవం నాడు, మీకు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది, మీరు #Mega154 కి స్త్రీ శక్తి ని తీసుకు వచ్చారు” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీతో శ్రుతిహాసన్ కి ఇది తొలి కాంబినేషన్ కావడం విశేషం..