MOVIE NEWS

‘హే సినామిక’ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హే సినామిక’. ప్ర‌ముఖ సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్ బృంద మాస్ట‌ర్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కురాలిగా మారారు. జియో స్టూడియోస్‌, గ్లోబ‌ల్ వ‌న్ స్టూడియోస్ ప‌తాకాల‌పై సినిమా రూపొందుతుంది.  మార్చి 3న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అక్కినేని నాగ చైత‌న్య‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, జ‌గ‌ప‌తి బాబు, సురేష్ బాబు, అదితిరావు హైద‌రి, బృంద మాస్టర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.
అక్కినేని నాగ చైత‌న్య మాట్లాడుతూ ‘‘బృంద మాస్ట‌ర్‌గారు సినిమాను డైరెక్ట్ చేస్తున్నార‌ని తెలియ‌గానే చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె కొరియోగ్ర‌ఫీకి నేను పెద్ద ఫ్యాన్‌ని. మాంటేజ్ సాంగ్‌ల‌ను చిత్రీక‌రించ‌డంలో ఆమెకు సెప‌రేట్ స్టైల్ ఉంటుంది. దానికి నేను పెద్ద అభిమానిని. మ‌నం సినిమాలో క‌నుల‌ను తాకే.. పాట‌ను ఆమెనే కొరియోగ్రఫీ చేశారు. ఎన్నో సాంగ్స్ ఆమె అద్భుతంగా కొరియోగ్ర‌ఫీ చేశారు. ఆమె ఓ ల‌వ్‌స్టోరిని డైరెక్ట్ చేస్తున్నార‌ని తెలియ‌గానే హ్యాపీగా అనిపించింది. ఆమె డైరెక్ట‌ర్‌గా పెద్ద స‌క్సెస్ అయినా, కొరియోగ్ర‌ఫీ మాత్రం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా కోరుకుంటున్నాను. నాకు దుల్క‌ర్‌తో మంచి అనుబంధం ఉంది. చెన్నైలోనే త‌ను నాకు తెలుసు. ఆటోమొబైల్స్, ఇత‌ర విష‌యాలు గురించి చాలానే మాట్లాడుకున్నాం. సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. దుల్క‌ర్, నేను యాక్ట‌ర్స్ అవుతామ‌ని అనుకోలేదు. కానీ ఇప్పుడు యాక్ట‌ర్స్‌గా మారి స్టేజ్‌పై నిల‌బ‌డి ఉన్నాం. త‌ను ఏ భాష‌లో ఏ పాత్ర చేసినా నిజాయ‌తీతోనే చేస్తారు. అదితి ఏ పాత్ర చేసినా అందులో ఓ కొత్త‌ద‌నం ఉంటుంది. ట్రైల‌ర్ చాలా బావుంది. సినిమాలో చాలా కోణాలున్నాయి. సినిమాను థియేట‌ర్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌నుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కి అభినంద‌న‌లు’’ అన్నారు. 
దుల్క‌ర్ స‌ల్మాన్ మాట్లాడుతూ ‘‘హే సినామిక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వ‌చ్చిన చైత‌న్య‌, జ‌గ‌ప‌తిబాబుగారు ఇత‌ర అతిథులు, న‌టీన‌టులంద‌రికీ ధ‌న్య‌వాదాలు. చాలా గ్యాప్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో మా హే సినామిక సినిమా మార్చి3న‌ విడుద‌ల‌వుతుండ‌టం చాలా హ్యాపీగా ఉంది. బృంద మాస్టర్‌గారు ఈ సినిమాతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యారు. ఓ యాక్ట‌ర్‌గా న‌న్ను సాంగ్స్‌లో రొమాంటిక్‌గా చూపించ‌డంలో కొరియోగ్రాఫ‌ర్‌గా ఆమె పాత్ర ఎంతో ఉంది. మా అమ్మ నా తల్లిలాంటిది. ఆమె గురించి మాట్లాడే ప్ర‌తి సంద‌ర్భంలో ఎమోష‌న‌ల్ అవుతుంటాను. ఈ సినిమాతో ప్రేమ‌లో ప‌డ‌తారు. ఎమోష‌న‌ల్ అవుతారు. డాన్స్ చేస్తారు. మార్చి 3న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి రాబోతున్నాం’’ అన్నారు. 

Tags

Related Articles

Back to top button
Close
Close