
ఫామిలీస్ యే కాదు పిల్లలు, యూత్‌కు బాగా నచ్చే సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు`
దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్లో మీరు 4వ సినిమా చేశారు. మీకున్న కంఫర్ట్ ఏమిటి?
తనతో సినిమా చేయడం అంటేనే చాలా కంఫర్ట్‌గా వుంటుంది. ఆయన చాలా క్రియేటివ్ పర్సన్. కథ చెప్పేటప్పుడే ఎక్కడ పాట రావాలి. ఎక్కడ ట్యూన్ పెట్టాలనేవి వివరిస్తారు. ఆయన చిత్రాలన్నీ సాంగ్స్ బేస్డ్ కథలే. ఆయన సినిమాల్లో ఎమోషన్ తో పాటు ఎంటర్టైన్ మెంట్ కూడా వుంటుంది. `ఆడవాళ్ళు మీకు జోహార్లు` సినిమా కిశోర్ కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్పగలను. నేను పాటలు చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. లాక్డౌన్ సమయంలోనే జూమ్‌లోనే నాకు ఈ కథ చెప్పారు. కథ చెప్పినప్పుడే మూడు, నాలుగు పాయింట్లకు ఐడియా చెప్పాను.` మాంగళ్యం తంతునా ` నేపథ్యం చెప్పగానే వెంటనే ట్యూన్ వచ్చేసింది. ఏదైనా ఆయన కథ చెప్పగానే ఐడియా వచ్చేస్తుంది. అందుకే ఆయనతో కలిసి సినిమా చేయడం చాలా కంఫర్టబుల్‌గా వుంటుంది. అదేవిధంగా టైటిల్ సాంగ్ అనుకుంటున్నప్పుడు దానికి ఫన్ కలిపితే బాగుంటుందని అనుకోవడం వెంటనే చేయడం జరిగిపోయాయి. వింటే మీకే అర్థమవుతుంది.