MOVIE NEWS

శివరాత్రి కానుక గా `రామారావు ఆన్ డ్యూటీ` టీజర్ రిలీజ్

శివరాత్రి కానుక  గా మాస్ మహారాజా రవితేజ,`రామారావు ఆన్ డ్యూటీ` టీజర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ  యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ LLP మరియు RT టీమ్వర్క్స్పై రూపొందుతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.

`రామారావు ఆన్ డ్యూటీ`సినిమా టీజర్ లాంచ్ తేదీని మేకర్స్ ఖరారు చేశారు. రామారావు ఆన్ డ్యూటీ టీజర్ మార్చి 1వ తేదీన మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రవితేజ న్యూ యాక్షన్ పోస్టర్ విడుదలచేసింది. ఈ పోస్టర్లో రవితేజ ఆకట్టుకునేలా సరికొత్త గెటప్లో కనిపించారు. ఈ పోస్టర్ భారీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా చక్కర్ లు కొడుతోంది    

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close