MOVIE NEWS

భోళా శంకర్ ఫస్ట్ లుక్ మార్చి ఫస్ట్ న రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్సివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోలా శంకర్”, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

 రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో  నిర్మిస్తున్నారు. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలు ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

స్వాగ్ ఆఫ్ భోలా పేరుతో ఈ చిత్రం  ప్రీ-లుక్‌ను మేకర్స్ ఇటీవలే విడుదల చేసారు. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, ఈ సినిమా ఫస్ట్ లుక్  సమయం వచ్చేసింది. భోలా శంకర్ ఫస్ట్ లుక్ మార్చి 1వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా ఉదయం 9:05 గంటలకు విడుదల కాబోతుంది. శివునికి మరొక పేరు అయిన శంకర్ టైటిల్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నందున, ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ఇది సరైన సమయం అని మేకర్స్ భావించారు

Tags

Related Articles

Back to top button
Close
Close