MOVIE NEWS

బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి బుధవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు.అనారోగ్యానికి గురైన బప్పి లహిరి కన్నుమూశారని ముంబై వైద్యులు చెప్పారు.
సింహాసనం, గ్యాంగ్ లీడర్, స్టేట్ రౌడీ తెలుగు సినిమాలకు బప్పి లహిరి సంగీత దర్శకత్వం వహించారు. బప్పి లహిరి వయసు 69 ఏళ్లు. వెటరన్ గాయకుడు అయిన బప్పి లహిరి గత ఏడాది ఏప్రిల్ నెలలో కొవిడ్ బారిన పడ్డారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమైన బప్పి లహిరి జుహూలోని తన స్వగృహంలో వీల్ ఛైర్‌ సాయంతో తిరిగారు.బప్పి లహిరి గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖ నటీనటులు సంతాపం తెలిపారు.

Tags

Related Articles

Back to top button
Close
Close