NEWS

నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలి

పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్,బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు పోతుగంటి పీరయ్య.

2022 నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరించిన శ్రీనివాసులరెడ్డి,హరిప్రసాద్, పీరయ్య.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసునిగా సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ రాణిస్తూ పలువురి మన్ననలు పొందారు

అలాగే తనతల్లి క్యాన్సర్ వ్యాధితో మరణించడాన్ని తట్టుకోలేక,నాలాంటి బాధ ఇంకెవ్వరూ పడకూడదనే ఉద్దేశంతో తన తల్లి పేరిట క్యాన్సర్ ఆసుపత్రిని 2000 సంవత్సరం జూన్ 22 వ తేదీన ప్రారంభించి దాదాపు రెండున్నర దశాబ్దాల నుంచి సామాజిక సేవ చేస్తూ వున్నారు

మరియు హిందూపూర్ శాసనసభ్యునిగా కొనసాగుతూ ఆ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి అడుగు జాడల్లో నడుస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుండి నేటి వరకూ పార్టీ కోసం అహర్నిశలు కృషిచేస్తూ అధికారం లోకి వచ్చేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

సినీ పరిశ్రమలోనూ,రాజకీయ రంగంలోనూ సేవ చేస్తూ బసవరామ తారక క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సామాజిక సేవ చేస్తూ ప్రజల అవసరాలు తీరుస్తున్న సేవకుడు నందమూరి బాలకృష్ణ

అలాంటి సేవకునికి *పద్మభూషణ్” అవార్డు ఇవ్వాలని ఘంటాపథంగా డిమాండ్ చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో టంటూస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జింకా శ్రీనివాసులు,మాజీ లిడ్ క్యాప్ డైరెక్టర్ రాజశేఖర్, బాలకృష్ణ అభిమాన సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి,ఉపాధ్యక్షుడు సౌదాగిరి వెంకటరమణ, దేవుని కడప చంద్ర,ప్రసాద్ నాయుడు,చికెన్ భాష,ఖాసిం తదితరులు పాల్గొన్నారు

Tags

Related Articles

Back to top button
Close
Close