MOVIE NEWS

యాక్షన్ ఎంటర్ టైనర్ “గం.. గం.. గణేశా” ఆనంద్ దేవరకొండ

“దొరసాని”, “మిడిల్ క్లాస్ మెలొడీస్”, “పుష్పక విమానం” చిత్రాలతో
టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. సహజత్వానికి
దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటూ తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారీ యంగ్
స్టార్. ఈసారి కూడా ఆనంద్ కొత్త ప్రయత్నం చేయబోతున్నారు.

తన తాజా సినిమా “గం..గం..గణేశా”ను సోమవారం లాంచ్ చేశారు. హై-లైఫ్ ఎంటర్
టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం
అవుతున్నారు.

ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిర్మాతలు కేదార్ సెలగంశెట్టి,
వంశీ కారుమంచి దర్శకుడు ఉదయ్ శెట్టి కి స్క్రిప్ట్ అందించారు. ఈ
కార్యక్రమంతో పాటు తాజాగా విడుదల చేసిన “గం..గం..గణేశా” సినిమా టైటిల్
పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ ఫెస్టివల్ బిగిన్స్ అని పోస్టర్ మీద
రాయడం, టైటిల్స్ లో గన్స్ డిజైన్ చేయడం చూస్తుంటే ఇదొక యాక్షన్ ఎంటర్
టైనర్ అని తెలుస్తోంది. ఆనంద్ ఇప్పటిదాకా చేయని యాక్షన్ జానర్ ను ఈ
చిత్రంతో టచ్ చేయబోతున్నారు.

చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాయికతో పాటు ఇతర నటీనటులు,
సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Tags

Related Articles

Back to top button
Close
Close