MOVIE NEWS

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ

జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెర ఆడియన్స్‌కి సుపరిచితమైన యాంకర్‌ రష్మీ.. వీలు కుదిరినప్పుడల్లా వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. జబర్దస్త్‌తో పాటు ఢీ, పండగ పండగకు స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పర్సనల్ మ్యాటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో రష్మీ- సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్ గురించి ఎన్నో వార్తలు షికారు చేయగా ఇప్పుడు ఏకంగా రష్మీ పెళ్లి మ్యాటర్ బయటకొచ్చింది.
యాంకర్‌ రష్మీ రహస్య వివాహం చేసుకుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలోనే రష్మీ సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందనే క్రేజీ అప్‌డేట్ తెగ షికారు చేస్తోంది. అయితే రష్మీ పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేదని అంటున్నారు. అతను ఓ ప్రైవేట్‌ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నాడట. ప్రస్తుతం తన భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే ఆమె నివాసం ఉంటోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కెరీర్‌ పరంగా పరంగా ఇబ్బందులు వస్తాయేమో అనే ఆలోచనలో రష్మీ ఈ విషయాన్ని దాచి ఉంచిందనే టాక్ ముదిరింది.

Tags

Related Articles

Back to top button
Close
Close