MOVIE NEWS

లైగర్ లో ఐటమ్ సాంగ్ లో సమంత

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాక తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది సామ్. ఈ క్రమంలోనే టాలీవుడ్, కోలీవుడ్ సహా బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్న ఆమె, రీసెంట్‌గా ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకుంది. ‘ఊ అంటావా మావా ఉఊ అంటావా మావ’ అంటూ హుషారెత్తించిన ఈ సాంగ్‌లో బన్నీతో కలిసి సమంత వేసిన స్టెప్పులకు అంతా ఫిదా అయిపోయారు.
ఈ అలజడి చూసిన పూరి జగన్నాథ్ అండ్ టీం సమంతపై దృష్టి పెట్టారట. విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న ‘లైగర్’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేసిన పూరి జగన్నాథ్.. అందుకోసం సమంతను సంప్రదించారని సమాచారం. ‘ఊ అంటావా మావా ఉఊ అంటావా మావ’ సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు స్పెషల్ సాంగ్‌లో సమంత ఎనర్జీ లెవల్స్ చూసి పూరి ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ సాంగ్ కోసం సమంతను ఒప్పించే బాధ్యతను స్వయంగా విజయ్ దేవరకొండ తీసుకున్నారని, ఆమెతో తనకున్న చనువుతో సామ్‌తో ఈ విషయం డిస్కస్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్.

Tags

Related Articles

Back to top button
Close
Close