
MOVIE NEWS
గడ్డం తెల్లపడితే ట్రిమ్ చేసుకోవాలి కానీ పెళ్లి కాదు చేసుకోవలసింది -నవదీప్
టాలీవుడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేసిన నవదీప్ చాలా మంది హీరోల్లానే బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆయన గడ్డం తెల్లబడుతుందని కొందరు నెటిజన్లు పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన నవదీప్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆయనేం చెప్పారంటే.. ‘అన్నా గడ్డం తెల్లబడుతోంది త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్ కానీ పెళ్లి కాదు. దురద పెడితే గోక్కుంటాం కానీ తోలు పీక్కోం కదా అలాగే’ అంటూ చెప్పుకొచ్చారు.