
నందమూరి తారకరామారావు గారి 26వ వర్ధంతి జరుపుకున్న శ్రీకాకుళం నందమూరి అభిమానులు మరియు శ్రీకాకుళం మాజీ MLA గుండ లక్ష్మీదేవి గారు
తెలుగువారి కీర్తి ఖ్యాతి అన్న ఎన్టీఆర్ గారని ఆయన 26 వ వర్ధంతి సందర్బంగా రక్తదానం చేసిన నందమూరి అభిమానులు అభినంద నీయులు అని శ్రీకాకుళం మాజీ MLA గుండ లక్ష్మీదేవి గారు అన్నారు
ఆంధ్రుల అభిమాన అన్న NTR గారి 26 వ వర్ధంతి సందర్బంగా శ్రీకాకుళం జిల్లా తారకరామా మోక్షజ్ఞ సేవా సంఘం (NTR MSS) ఆధ్వర్యంలో డేవిడ్ మిత్రబృందం ఈరోజు స్థానిక New blood bank లో సుమారు , 40 మంది రక్తదానంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రారంభించిన లక్ష్మీ దేవి గారు మాట్లాడుతూ నందమూరి అభిమానులు యెల్ల వేళలా నిరంతరం సేవా కార్యక్రమాలు ద్వారా సమాజానికి అండ గా నిలవడం చాలా సంతోషం అను ముఖ్యం గా బాలయ్య బాబు, jr, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గారి అభిమానులు, యువత కలిసి మనందరి అభిమాన నాయకులు అన్న గారి వర్ధంతి సందర్బంగా మంచి కార్యక్రమం చేసారని వారందరికీ నా అభినందనలు అని ఎన్టీఆర్ గారు కూడా సినీ రంగం లో అగ్ర కథానాయకులు గా ఉన్నపుడే రాష్ట్ర ప్రజలకు కష్టాలు ఉన్నపుడు తాను ముందుండి యావత్తు చిత్ర పరిశ్రమను ఒక తాటిపైకి తెచ్చి దివి సీమ ఉప్పెన, మరియు రాయలసీమ కరువు సమయం లో ప్రజలకు అండ గా నిలిచి ఆదుకొని సేవ చేసారని అదే స్ఫూర్తి తో పార్టీ పెట్టి ప్రజా నాయకులు అయ్యారని , బాలయ్య బాబు కూడా సేవా రంగం ద్వారా తండ్రి ఆశయాలు నెరవేరుస్తున్నారని అభిమానులుగా డేవిడ్ టీం తారకరామా మోక్షజ్ఞ సేవా సంఘం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, రక్త దాన కార్యక్రమాలు చేస్తున్నారని అందుకుడేవిడ్ కు, వారి మిత్రులకు, నందమూరి అభిమానులందరికి తాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని లక్ష్మీదేవి గారు అన్నారు
ఈ కార్యక్రమం లో శ్రీకాకుళం జిల్లా నందమూరి బాలయ్య & మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, నందమూరి తారకరామా మోక్షజ్ఞ సేవా సంఘం అధ్యక్షులు డేవిడ్, అభిమానులు సురకాశి వెంకటరావు, క్యాడర్ కవ్వాడి సుశీల, సీపాన రమా, సేవా సంఘం సభ్యులు సుభాష్, రమేష్, చెన్న రమణ, భాగ్యరాజ్, నరేష్, సాయితేజ, మణి, రాజీవ్ కిరణ్, ఈశ్వర్, ఎర్రన్నాయుడు, సురేష్, దుర్గా మణికంఠ, మోహన్, భాస్కర్, ఉపేంద్ర, శ్రవణ్, రాజు తదితరులు పాలుగున్నారు