NEWS

ప్రధాని మోడీతో భేటీలో ఉపాసన డ్రెస్ పై నెటిజన్ కామెంట్స్

తాజాగా రాం చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అందులో దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటోను ఆమె షేర్ చేశారు. అయితే.. ఈ ఫోటోలో ఉపాసన ధరించిన దుస్తులు హుందాగా లేకపోగా.. ఆమె స్థాయికి ఏ మాత్రం సరిపోయేలా లేవని చెప్పక తప్పదు. ర్యాప్ జీన్స్.. అది కూడా పెద్ద ఎత్తున చిరుగులతో ఉన్న జీన్స్ ను ఆమె ధరించిన వైనాన్ని తప్పు పడుతున్నారు.దేశ ప్రధానిని కలిసే సందర్భంలో ధరించే దుస్తులు హుందాగా ఉండాలే కానీ.. ఇలా ఫ్యాషన్ బుల్ గా ఉండాల్సిన అవసరం ఏముందంటున్నారు. ఒకవేళ.. ఇలాంటి దుస్తులు ధరించాలంటే మెగా ఫ్యామిలీలో జరిగే వేడుకల సందర్భంగా ధరిస్తే బాగుంటుంది కదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గౌరవనీయ స్థానాల్లోని వారిని ఒక సంస్థ నుంచి ప్రాతినిధ్యం వహించేటప్పుడు హుందాతనాన్ని ప్రతిబింబించేలా వస్త్రధారణ అయితే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.ఇంతకీ ఆమె ప్రధాని మోడీని ఎందుకు కలిశారు? అన్న విషయంలోకి వెళితే.. ఇండియన్ ఎక్స్పో- 2020లో భాగంగా ఈ సమావేశం జరిగినట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్ పో 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నాను. ఆవిష్కరణ.. ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగుపర్చటం.. మహిళా సాధికారత.. కల్చర్ పరిరక్షణ మీద దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలు. సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాల్ని ఇస్తుందన్నారు.సాంకేతికతను మనం తెలివిగా.. సమర్థంగా ఉపయోగించుకోవాలని పోస్టులో పేర్కొన్న ఉపాసన.. సంస్కృతి పరిరక్షణ అని చెబుతున్న ఉపాసన మాటలకు.. చేతలకు సంబంధమే లేదంటున్నారు. ప్రాశ్చాత్య భావజాలానికి ప్రతీకలైన మోకాళ్ల దగ్గర చిరిగిన ర్యాప్ జీన్స్ ను వేసుకోవటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా ఇలాంటి వస్త్రధారణ సరికాదంటున్నారు. చెప్పే మాటలకు ఏ మాత్రం సింక్ కాని రీతిలో ఉన్న ఆమె ఫోటోతో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ ప్రధానిని కలిసే వేళ.. మరింత హుందాగా ఉండే దుస్తులు ధరించి ఉంటే బాగుండేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Tags

Related Articles

Back to top button
Close
Close