Movie Reviews

సప్తగిరి గూడుపుఠాణి సినిమా రివ్యూ

రివ్యూ – గూడుపుఠాణి

నటీనటులు : సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచె, అనంత్ తదితరులు

సాంకేతిక నిపుణులు: కెమెరామెన్: పవన్ చెన్న, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, మ్యూజిక్: ప్రతాప్ విద్య, నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్, డైరెక్షన్: కుమార్.కె.ఎం

ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్న సప్తగిరి హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కొత్త మూవీ గూడుపుఠాణి. నేహా సోలంకి హీరోయిన్ గా నటించింది. ఓ కొత్త తరహా కథా కథనాలతో అదిరిపోయే ట్విస్టులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కుమార్ కేఎం. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన గూడుపుఠాణి సినిమా శనివారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

దేవాలయంలో ఓ యువ జంట హత్య కలకలం రేపుతుంది. ఇన్వెస్టిగేషన్ కోసం రంగంలోకి దిగుతారు పోలీసులు. ఇదిలా ఉంటే మరో ప్రేమ జంట గిరి (సప్తగిరి), సిరి (నేహా సోలంకి) పెళ్లి చేసుకునేందుకు ఊరి చివర గుడిలోకి వెళ్తారు. దైవ దర్శనం చేసుకుంటుంటే వీళ్లను గమనించకుండా పూజారి గుడి తలుపులు మూసేసి వెళ్లిపోతాడు. గుడిలో చిక్కుకున్న గిరి, సిరికి అక్కడి అమ్మవారి ఆభరణాలు దొంగిలించేందుకు వచ్చిన దుండగులు కనిపిస్తారు. ఆలయ కమిటీ మెంబర్ (రఘు కుంచె), పోలీసు (ప్రభు) సహాయంతో ఈ నేరాలకు పాల్పడుతుంటాడు. ఈ దొంగలకు పట్టుబడుతుంది సిరి. తనకు కాబోయో భార్యను గిరి ఆ దుండగుల బారి నుంచి ఎలా కాపాడుకున్నాడు, అసలీ దొంగలకు గతంలో జరిగిన ఆలయ హత్యలకు సంబంధం ఏంటి, గిరి, సిరి ఈ ముఠాకు ఇచ్చిన అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అనేది తెరపై చూడాలి.

ఎలా ఉందంటే

సస్పెన్స్, ట్విస్టులతో రాసుకున్న కొత్త తరహా కథ ఇది. సినిమా ప్రారంభంలోనే విలన్ రఘు కుంచెను క్రూరంగా పరిచయం చేసిన దర్శకుడు కుమార్ కేఎం సినిమా మీద ఆసక్తిని పెంచాడు. యువ జంట హత్య, ఆపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలవడం గూడుపుఠాణి సినిమా నెక్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. ఇంతలో గిరి, సిరి పెళ్లి కోసం అలాంటి గుడికే వెళ్లడం, గుడిలో చిక్కుకోవడం, అక్కడ కొన్ని అనూహ్య భయాలకు ఈ జంట లోనుకావడంతో ఈ సినిమా హారర్ జానర్ లో ఉంటుందా అనే సందేహాలు కలుగుతాయి. ఎప్పుడైతే దొంగలముఠా ఎంటర్ అవుతుందో, అక్కడి నుంచి హీరో, హీరోయిన్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ప్రేమించిన అమ్మాయిని కళ్లముందే క్రిమినల్స్ వేధిస్తుంటే అప్పటిదాకా వెయిట్ చేసిన హీరో ఆ తర్వాత భయపడుతూనే ఫన్నీగా ఫైట్ చేయడం కొత్తగా ఉంది. ఈ సీన్స్ లో ఊసరవెళ్లి చిత్రంలో ఎన్టీఆర్ ను గుర్తు చేశారు సప్తగిరి. ఇక కథలో ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలైట్. ఇది రివీల్ చేస్తే కథ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో తెరపైనే చూాడాలి.

ప్రథమార్థం సరదాగా సాగుతుంది కథ. పాటలు, ఫన్నీ సీన్స్ తో వెళ్తుంది. హీరో హీరోయిన్స్ గుడిలోకి ఎంటర్ కాగానే అసలు స్టోరి బిగిన్ అవుతుంది. ఇక్కడి నుంచి థ్రిల్లింగ్ గా కథను నడిపారు దర్శకుడు. గిరి పాత్రలో సప్తగిరి చాలా సహజంగా నటించారు. నేను హీరోను, నేను విలన్లకు భయపడటం ఏంటి అనేది లేకుండా కథకు తగినట్లు మారిపోయారు. నేహా సోలంకి ట్రెడిషినల్ గా కనిపించి ఆకట్టుకుంది. ఆమె క్యారెక్టర్ కు సినిమాలో హీరోకు తగినంత స్పేస్ ఉండటం విశేషం. రఘు కుంచె విలన్ గా కొత్తగా అనిపిస్తారు. అనంత్ విలన్ క్యారెక్టర్ చేయడం ఇదే తొలిసారి అనుకుంటా. మిగతా నటీనటులు కథలో ఒదిగిపోయారు. ఒక మంచి సినిమాను నిర్మించడంలో ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్ వాల్యాస్, నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ అభిరుచి, ప్యాషన్ కనిపిస్తుంది. పాటల్లో నీలినింగి పాట ట్యూన్, పిక్చరైజేషన్ చాలా బాగుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ లాంటి టెక్నికల్ విభాగాల్లోనూ గూడుపుఠాణి సినిమా ది బెస్ట్ అనిపించుకుంటుంది.

రేటింగ్ 3.25/5

Tags

Related Articles

Back to top button
Close
Close