
MOVIE NEWS
డిసెంబర్ 3న రాబోతోన్న మోహన్ లాల్ ‘మరక్కార్’ సెన్సార్ పూర్తి
మరక్కార్ సినిమా మీద మళయాలంలోనే కాకుండా తెలుగులో మంచి బజ్ ఏర్పడింది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
మోహన్ లాల్‌కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన మన్యం పులి సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. జనతా గ్యారెజ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ మీద ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆంటోని పెరంబువూర్ ఈ సినిమాను కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.