MOVIE NEWS

సెన్సార్ కోసం ఎదురు చూస్తున్న శివ 143

సంక్రాంతి కి విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేసాం కానీ సెన్సార్ వారు చూడని కారణము గా సంక్రాంతి కి విడుదల చేయలేక పోయాం.డిస్ట్రిబ్యూటర్స్ లేక థియేటర్స్.లేక ఫైనాన్స్ ప్రోబ్లేమ్స్ వల్ల సినిమలు పోస్ట్ పోన్ అవుతాయి.కానీ సెన్సార్ వల్ల పోస్ట్ పోన్ ఐన సినిమా శివ 143.

శైలేష్,ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్) చిత్రాన్ని  ఫిబ్రవరిలోవిడుదల చేస్తున్న సందర్బంగా ప్రముఖ ఎంపీ. టీజీ వెంకటేష్ “శివ 143” మూవీ రిలీజ్ పోస్టర్ ను చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేశారు.అనంతరం..

టీజీ వెంకటేష్ మాట్లాడుతూ…భీమవరం టాకీస్ నిర్మించిన శివ143 మూవీ తో రామసత్యనారాయణ సెంచరీ దాటడానికి దగ్గరలో ఉన్నందున చాలా సంతోషంగా ఉంది..సెంచరీ తో ఆపకుండా రామసత్యనారాయణ మరెన్నో చిత్రాలు నిర్మించాలని అన్నారు..

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ…ఇది 98 వ చిత్రం 100 చిత్రాలకు చేరువలో ఉంది.మా రోశయ్య గారి తరువాత మాకు పెద్ద దిక్కు టి.జి.వెంకటేష్ గారు చిన్న వాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా పిలిస్తే పలికే దైవం మా టి.జి.వెంకటేష్ గారు.ఈ మధ్యనే ఆయన గారి తో పోలీస్ పటాస్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయించి సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేయడం జరిగింది.అలాగే ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నాము. మాకు  బ్లెస్సింగ్ ఇచ్చిన టి.జి.వెంకటేష్ గారికి,అలాగే వెంకీ మామ నిర్మాతకు మా చిత్ర యూనిట్ తరుపున వారికి ఆబినందలు తెలుపుచున్నాము అని అన్నారు..

నటీనటులు:*
సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,.

సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి
ఎడిటర్: శివ వై ప్రసాద్..
కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి.
ట్రైలర్ కట్ & సిజీ: నరేన్.
పీఆర్ఓ: మధు వి.ఆర్.
నిర్మాత: రామసత్యనారాయణ.
కథ, స్క్రీన్ ప్లే, స్టట్స్, డాన్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close