MOVIE NEWS

అభిమాని కోరిక తీర్చిన jr NTR

ఎన్‌టీఆర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిమాని కోరిక తీర్చాడు. హీరోను చూడాలని, వారితో చివరిసారిగా మాట్లాడాలి అనుకుంటే మాత్రం విషయం తెలిసిన వెంటనే అభిమానుల కోరిక తీర్చడానికి షూటింగుల్లో బిజీగా ఉన్నా సమయం కేటాయిస్తున్నారు. ఎన్‌టీఆర్‌ చావు బతుకుల మధ్య ఉన్న ఓ అభిమాని కోరిక తీర్చాడు. ఎన్‌టీఆర్‌ కి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన కొప్పాడి మురళీ వీరాభిమాని.

కొప్పడి మురళీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వైద్యులు మురళీ కోరికలను, ఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా, తన అభిమాన హీరో ఎన్‌టీఆర్‌తో ఒక్కసారి మాట్లాడాలని ఉంది..అంటూ చెప్పాడు. ఈ విషయం తారక్‌కి తెలియడంతో వెంటనే వీడియో కాల్ చేసి మురళీతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ధైర్యంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎన్‌టీఆర్ ఆకాంక్షించారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close