MOVIE NEWS

నాట్యం` సినిమాలోని `వేణువులో..` పాట‌ను రిలీజ్ చేసిన మాస్ మ‌హారాజా ర‌వితేజ

నాట్యం`అంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం `నాట్యం`. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా ప‌రిచ‌యం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజర్, సాంగ్స్‌కి  ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా నాట్యం సినిమా నుండి `వేణువులో చేర‌ని గాలికి సంగీతం లేదు…` అనే పాట‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యం అందించిన ఈ పాట‌కు  శ్రవణ్ భ‌రద్వాజ్ మంచి ట్యూన్ కంపోజ్ చేశారు.  అనురాగ్ కుల‌క‌ర్ణి శ్రావ్యంగా ఆల‌పించిన ఈ పాట శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది. నాట్యం చిత్రం అక్టోబ‌రు 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.

ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.  

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close