MOVIE NEWS

ఆట నాదే వేట నాదే సినిమా రివ్యూ

“ఆట నాదే.. వేట నాదే..”మూవీ రివ్యూ.
తారాగణం :
భరత్, సంచిత శెట్టి,చాందిని తమిళ రసన్, ఖతీర్ ,రాధా రవి , యోగ్ జపి, ఆత్మ పాట్రిక్, గడ్డం కిషన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సమర్పణ :-వీరాంజనేయులు & రాజ్యలక్ష్మి
నిర్మాత :- కుబేర ప్రసాద్
రచన దర్శకత్వం :-అరుణ్ కృష్ణస్వామి
సహ నిర్మాతలు :- అక్కినేని శ్రీనివాసరావు, అట్లూరి సురేష్ బాబు
సంగీతం :- ఏ మోసెస్
ఛాయాగ్రహణం :; యువ
కూర్పు :- గోపికృష్ణ
వి.ఎఫ్.ఎక్స్  :-చందు ఆది – అండ్ టీం
ఆర్ట్ డైరెక్టర్ :- సుబ్బు.ఏ
నృత్యం :-  విజయ సతీష్
పాటలు, మాటలు :-భారతీబాబు
నేపథ్య సంగీతం :- సుదర్శన్ కుమార్

స్టోరీ :మనిషి జీవితమే ఒక ఆట ప్రేమ అనే ఆటలో గెలవాలంటే మనుసులను  గెలవాలి,  మనసులను గెలవాలంటే గెలుపోటములు ఉంటాయి . గెలుపు ఓటమి అనేది ప్రతి ఆట లో ఉంటాయి .ఒక ప్రేమికుడు తను  కోరుకున్న అమ్మాయిని గెలుచు కోవడం కోసం గుర్రపు పందేలు ఆడదానికి సిద్ధమయ్యి ఆఖరి రూపాయి వరకు తను ఎంత కష్టపడ్డాడు ఆ గుర్రపు పందేలు ఎంతోమంది హేమాహేమీలు ఉన్నా.. గుర్రపు పందేలలో తను నెగ్గి తన ప్రేమను గెలిపించు కున్నాడా..తను గెలిచాడా.. ఒడిపోయాడా.. తనకోసం అనుకోని  ఇంకొక తన ఫ్రెండ్ ను ఈ ఉచ్చు లోకి లాగితే అమాయకుడైన ఫ్రెండ్ తను కూడా ఈ పోటీకి సిద్ధమై తను  సహాయ పడ్డాడా.. తను గెలిచాడా.. తన ప్రేమను గెలిపించుకున్నాడా… గెలుపు ఓటమి అనేది మనిషికి ముఖ్యం అది ప్రేమ కావచ్చు జీవితంలో కావచ్చు  ఆటలో అవ్వచ్చు అయితే ఈ ఆట ఆడేటప్పుడు ప్రేమ  మనిషిని గెలిపించుకోవడం కోసం రేస్ ఆడవలసిన అవసరం లేదు అని చెప్పవచ్చు.అలాగే మనిషి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం  దేనికైనా  తెగిస్తాడు  అనేది సినిమా ఇతి వృత్తం. తన మనసు దోచిన అమ్మాయిని  గెలుచుకోవడం కోసం ఇద్దరు కుర్రాళ్లు ఈ ఆటలో పోటీపడి ఎలా నెగ్గారు. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నారు తన జీవితంలో ఎలా గెలిచారు అంటే మన రివ్యూ లోకి వెళ్లవలిసిందే.

విశ్లేషణ :భరత్ (విక్రమ్ ),రసన్ (శ్రీధర్ ), సంచిత (విన్నీ ), చాందిని (లక్ష్మి )అలాగే నరేంద్ర, శర్మ, ఇద్దరు విల్లన్స్, ప్రదానంగా ఈ కధ ఆరుగురు చుట్టూ డైరెక్టర్ కధని అల్లుకున్న తీరు అభినందనీయం, హీరో విక్రమ్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ లో అకౌంటెంట్ జాబ్ చేస్తూవుంటాడు, ఆ కంపెనీ అకౌంట్లోని డబ్బని తన రేసింగ్ పిచ్చితో ఆ డబ్బును రేసింగ్ లో పోగొడతాడు, ఎలాగైనా తిరిగి ఆ రేసింగ్ లో డబ్బు సంపాదించి కంపెనీ వాళ్ళు చెక్ చేసే లోపు తిరిగి రికవరీ చేయాలి అని చూస్తాడు ఈ ప్రయాణం లో విన్నీతో రోడ్ సిగ్నల్ దగ్గర బైక్ పైన వున్నా విన్నీని చూసి ప్రేమలో పడతాడు, శ్రీధర్ జాబ్ కోసం సిటీకి వస్తాడు ఉండటానికి తన సిస్టర్ ఫ్రెండ్ అయిన లక్ష్మి ఇంట్లో ఉంటాడు ఈ క్రమమం లో ఇద్దరు ప్రేమలో పడతారు,అదే అమ్మాయిని అదే అపార్ట్మెంట్ లో వుండే విక్రమ్ ఫ్రెండ్ ఫాలో అవుతూవుంటాడు, ఒకరోజు ఆ ఫ్రెండ్ విక్రమ్ కి కంప్లైంట్ చేస్తాడు నేను ఫాలో అయ్యే అమ్మాయిని ఒకడు ఫాలో అవుతున్నాడు అని చెప్పగానే విక్రమ్ అక్కడకి వస్తాడు అక్కడకి వచ్చాక శ్రీధర్ కనిపిస్తాడు అప్పుడు వీళ్ళు ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ అని మనకి తెలుస్తుంది.ఇద్దరు విల్లన్స్ కి ఈ లవ్ స్టోరీ ట్రాక్ ఈ సినిమా కి ప్రధాన బలం అని చెప్పాలి,ఈ ఇద్దరి ప్రేమకధలకి, రేసింగ్ చేసే నరేంద్ర, శర్మ లకి ఈ కధ కి సంబంధం ఏమిటీ అని తెలియాలి అంటె థియేటర్ కి వెళ్లి సినిమా చూడవలిసిందే.
ప్లస్ పాయింట్స్ :
కధ
స్క్రీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సాంగ్స్
మైనస్ పాయింట్స్ :
కొద్దిగా అక్కడ అక్కడ కధ స్లో అవ్వటం.
రేటింగ్ :3/5

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close