MOVIE NEWS

* నాగ శౌర్య , రీతువర్మ ల “వరుడు కావలెను” నుంచి విడుదల అయిన పెళ్ళి వేడుక గీతం

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘నేడు (2-10-2021) ‘వరుడు కావలెను‘ యూనిట్ చిత్రంలోని ఓ వీనుల విందైన గీతాన్ని విడుదల చేశారు. 
ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే కన్నుల పండుగ గా అ(క)నిపిస్తుంది. వివరాల్లోకి వెళితే…‘‘ వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు …వయ్యారం చిందేసే అందాల భామలు” అంటూ సాగే ఈ గీతం రచయిత రఘురామ్ రచిం చారు. ఈ గీతాన్ని గాయనీ, గాయకులు శ్రీకృష్ణ, గీతామాధురి, ఎం ఎల్ గాయత్రి, అదితి భావరాజు, శ్రుతి రంజని లు వీనుల విందుగా ఆలపించారు. ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సమకూర్చిన సంగీతం  హుషారుగా సాగుతుంది. చిత్ర నాయకా నాయిక లు ‘నాగశౌర్య, రీతువర్మ‘ లతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా చిత్ర కథానుసారం ఓ పెళ్లి వేడుక నేపథ్యంలో  తెర రూపంగా  ఈ గీతం కనిపిస్తుంది. హుషారైన సంగీతం, చక్కని సాహిత్యం ఈ పాట సొంతం. వీటికి తోడు బృంద మాస్టర్ నృత్య రీతులు మరింత హుషారెత్తిస్తాయి.ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 15 న దసరా కానుకగా చిత్రం విడుదల.
నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close