MOVIE NEWS

రవితేజ69 అక్టోబర్ 4న ప్రారంభం

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ మూవీ టైటిల్‌ ఇంకా ఫిక్స్ కాలేదు. RT69గా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత, వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత.

ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారు.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

రవి తేజ, త్రినాథరావు నక్కిన కాంబోలో రాబోతోన్న RT69 కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. థియేటర్లో ఆడియెన్స్‌ను నవ్వించేలా ఉండబోతోంది. అక్టోబర్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close