MOVIE NEWS

తెలుగు చలన చిత్ర మండలి ప్రెస్ నోట్

ప్రెస్ నోట్ ;
తారీఖు; 01 / 10 /2021

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మ్యుషియల్లి ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగు సొసైటీ , బైలా ప్రకారం తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిలు మెంబర్లు మరియు కౌన్సిలు ధ్రువీకరించిన తెలుగు ఫిల్మ్ పరిశ్రమ మెంబర్లకు మాత్రమే మెంబర్షిప్ ఇవ్వాలి . కానీ పైన ఉదహరించిన సొసైటీ బైలను ఉల్లంఘిస్తూ బయట వ్యక్తులకు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది .ఈ విషయమై ప్రొడ్యూసర్స్ కౌన్సిలు 18 -09 -2021 న లెటర్ ద్వారా కోపరేటివ్ హౌసింగు సొసైటీ కమీషనరుకు (తెలంగాణ రాష్ట్రం) అబ్జక్షన్స్ తెలియజేస్తూ దీనిపై తక్షణం తగు చర్య తీసుకోవాలని కోరడం జరిగింది . పైన ఉదహరించిన సొసైటీ ఈ విషయమై బైలా ఏమేండ్ మెంటును ”ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న సంస్థలకు , సొసైటీలు మొదలగునవి మరియు వ్యక్తులకు మెంబర్షిప్ ఇవ్వడం” 03 -10 -2021 న జరగబోయే వారి సొసైటీ వార్షిక సర్వ సభలో ఆమోదం కొరకు
ప్రవేశ పెట్టడం పై ”తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిలు” ఇది సిద్ధాంతాలకు విరుద్ధం కాబట్టి అబ్జక్షన్స్ తెలియజేయడం జరిగింది .

తదుపరి ఈ విషయమై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిలు హై కోర్ట్ లో కేసు వేయడం జరిగింది (రిట్ . పిటీషన్ . నం. 24548 / 2021 ది. 01.10 .2021 ). గౌరవ హై కోర్టు దీనిని పరిశీలించి కోపరేటివ్ సొసైటీ కమీషనరుకు ప్రొడ్యూసర్స్ కౌన్సిలు 18 -09 -2021 న పంపిన లెటర్లో విషయాలు పరిశీలించి చర్య తీసుకోవాలి అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది .

(శ్రీ టి ప్రసన్నకుమార్ ) ( శ్రీ మోహన్ వడ్లపట్ల )
గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close