MOVIE NEWS

డీజే టిల్లు టీజర్ విడుదల.

డిజె టిల్లు’. ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదల అయింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది. ప్రచార చిత్రాన్ని గమనిస్తే… ఏ చిత్రం అయినా ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించ టానికి టీజర్ అనేది ఓ మొదటి మెట్టు లాంటిది.  ఇప్పుడు విడుదల అయిన హీరో సిద్ధు జొన్నలగడ్డ ‘డిజె టిల్లు’ టీజర్ కూడా అలాంటిదే. పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకునేలా సాగుతుంది. ఇందులోని దృశ్యాలు గానీ, సంభాషణలు గానీ  ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయి.విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు దర్శకుడు విమల్ కృష్ణ. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు.
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డమాటలు: సిద్దు జొన్నలగడ్డసంగీతం: శ్రీచరణ్ పాకాలఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగుఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేనిపి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్సమర్పణ: పి. డి. వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశిదర్శకత్వం: విమల్ కృష్ణ

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close