AndhrapradeshNEWS

“చెత్త పై పన్ను, ఆస్తి పన్ను పెంపు” వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించు కోవాలని ” ఇప్పటికే కరోనా తో కష్టాలు, ఆకాశమే హద్దు గా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల తో ప్రజానీకం నరక యాతన పడుతున్నారని శ్రీకాకుళం మాజీ MLA గుండ లక్ష్మీ దేవి గారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ కోరారు

ప్రభుత్వం అడ్డుగోలుగా పెంచిన “ఆస్తి విలువ ఆధారంగా పెంచిన ఆస్తి పన్ను” చెత్త పై పన్ను “వెంటనే ఉప సంహరించుకోవాలని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈరోజు (05/08/21) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఆఫీస్ లో వినతిపత్రం అందించిన అనంతరం వారు మాట్లాడుతూ
లాక్డౌన్, కర్ఫ్యూ తో ఆదాయం లేక సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఆర్థికంగా దెబ్బ తిన్నారని అంతే కాకుండా విపరీతంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయని, ఇక కరెంట్ బిల్లులు పెంపు తో ప్రజలకు షాకులు కొడుతున్నాయని వీటిని పెరగకుండా నియంత్రణ చేయడం లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం అయ్యిందని ఇన్ని రకాలుగా ప్రజానీకం ఇబ్బందులు రాష్ట్రం లో పడుతుంటే ఇపుడు పుండు పై కారం చల్లినట్లు మున్సిపాలిటీ లు, నగర కార్పొరేషన్ లలో ఆస్తివిలువ ఆధారంగా భారీ ఎత్తున ఆస్తి పన్ను పెంచు తున్నారని ఆఖరికి పనికి రానిదని మన ఇంటిలో ” చెత్తను” మనం రోడ్ పై పారబోస్తే దాని పై కూడా ఈ ycp ప్రభుత్వం నగరం లో ప్రతీ ఇంటి కి, ప్రతీ నెలా పన్ను వేస్తుందని, పెద్ద హోటల్స్ కు, వ్యాపార సంస్థలకు, సినీ థియేటర్స్ కు కూడా భారీ ఎత్తున పన్ను పోటు వేస్తోందని అలాగే చిరు వ్యాపారాలు చేసుకుంటూ రోడ్ పై తోపుడు బళ్ళువ్యాపారులు పై కూడా పన్ను వేసి వారి నడ్డి విరగొట్టుతోందని ఇప్పటికే ఆర్థిక లోటు తో, నిత్యవసరాల పెంపు తో బ్రతుకు బండిని నెట్టుకొస్తున్న ప్రజలు ఇకఎలా బ్రతకాలని అలాగే వీటిన్నిటి పై ఈ పన్నులు భారం వలన వ్యాపారవర్గాలు సరుకులు ధరలు పెంచే ప్రమాదం ఉందని దీని వలన అంతిమంగా ప్రజలుపైనే ఈ పన్నులుఆర్ధిక బండ పడే అవకాశం ఉందని కావునా ప్రభుత్వం తీసుకున్న ఈ పన్నుల పెంపు నిర్ణయం ప్రజా సంక్షేమం దృష్ట్యా తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేసారు అదే విధంగా రెండు రోజులు గా నగరం లో త్రాగు నీరు కు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ హయాంలో నాగావళి నదిలో స్మార్ట్ సిటీ కోసం 4. 97 కోట్లతో మంజూరు చేయడం జరిగిందని అది పూర్తి చేస్తే నగర పరిధిలో ఉండే ప్రజలకు రెండు పూటలా త్రాగునీరు సరఫరా చేయొచ్చని లక్ష్మదేవి గారు, అన్నారు

ఇంకా ఈ కార్యక్రమం లో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి చిట్టి నాగ భూషణం పార్లమెంట్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు PMJ, బాబు రాష్ట్ర హస్త కళల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ , పార్లమెంట్ నియోజకవర్గం కోశాధికారి ఇప్పిలి తిరుమలరావు, మీడియా కన్వీనర్ డాక్టర్, జామి, భీమశంకర్,మాజీ లిడ్క్యాప్ డైరెక్టర్ SV రమణ మాదిగ, పాలిశెట్టి, మల్లిబాబు, మాజీ కౌన్సిలర్ గంగు నాగేశ్వరరావు, ఉమా రుద్ర కోటేశ్వర ఆలయ మాజీ చైర్మన్ వాళ్ళ కిరణ్, నగర టీడీపీ డివిజన్ ఇంచార్జి లు పట్నాల పార్వతీశం, కరగాన భాస్కరరావు, విభూది సూరిబాబు, చవిటిపల్లి గోవింద, మైలపల్లి రాజు, రోణంకి కళ్యాణ్, కోల శ్రీనివాస్ దేవ్, సిరిపురం హరి, జిల్లా టీడీపీ కార్యాలయం మేనేజర్ గొర్లె వెంకటరమణ, నాయకులు బాసిన వెంకటేష్, యువత నాయకులు సాధు, వెంకటేష్, నగర నాయకులు పొట్నూరు తులసీరామ్, ఇప్పిలి ప్రసాద్, బత్తిన శ్రీను, కాళీ శర్మ, లొట్టి సూరిబాబు, మూగి ధనరాజు, సంగీతరావు షణ్ముఖ, కుప్పిలి సతీష్ తదితరులు పాలుగోన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close