MOVIE NEWS

ఆరుగురుమేల్ లీడ్స్‌, ఆరుగురు ఫిమేల్ లీడ్స్‌తో నాని స‌మ‌ర్ప‌కుడిగా వాల్‌పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న‌ `మీట్ క్యూట్‌`

నేచుర‌ల్ స్టార్ నాని.. వాల్ పోస్ట‌ర్ సినిమా అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప్ర‌శాంతి తిపిర్‌నేని నిర్మాత‌గా వైవిధ్య‌మైన సినిమాల‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఆ, హిట్` వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు రూపొందించి ఆడియెన్స్‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అదే త‌ర‌హాలో డిఫ‌రెంట్ కంటెంట్‌తో `మీట్ క్యూట్‌` అనే అంథాల‌జీని రూపొందిస్తోంది వాల్ పోస్ట‌ర్ సినిమా. `ఆ` సినిమాతో ప్ర‌శాంత్ వ‌ర్మ‌, `హిట్` చిత్రంతో శైలేష్ కొల‌ను వంటి టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేసిన ఈ బ్యాన‌ర్ ఇప్పుడు `మీట్ క్యూట్‌` ద్వారా దీప్తి గంటాను ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం చేస్తున్నారు.

అంద‌రిలో ఆస‌క్తిని క్రియేట్ చేస్తూ `మీట్ క్యూట్‌` ప్రాజెక్ట్‌ను జూన్‌లో లాంఛ‌నంగా ప్రారంభించారు. ప్ర‌స్తుతం షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఐదు క‌థల సంక‌ల‌నంగా రూపొందుతోన్న ఈ అంథాల‌జీని సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌రాజ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ అంథాల‌జీలో రోహిణి, ఆదాశ‌ర్మ‌, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, ఆకాంక్ష సింగ్‌, రుహానీ శ‌ర్మ‌, సునైన‌, సంచితా పూనాంచ .., అశ్విన్‌కుమార్, శివ కందుకూరి దీక్షిత్ శెట్టి, గోవింద్ ప‌ద్మ‌సూర్య‌, రాజా … ఇలా  ఇందులో వేర్వేరు భాష‌ల‌కు చెందిన‌ ఆరుగురు మేల్ లీడ్స్‌, ఆరుగురు ఫిమేల్స్‌ లీడ్ రోల్స్ చేస్తున్నారు. .
వ‌సంత్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విజ‌య్ బుల్గానిన్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా… అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌, గ్యారీ బి.హెచ్ ఎడిట‌ర్స్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
స‌త్య‌రాజ్‌, రోహిణి, ఆదాశ‌ర్మ‌, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, ఆకాంక్ష సింగ్‌, రుహానీ శ‌ర్మ‌, సునైన‌, సంచితా పునాంచ‌, అశ్విన్ కుమార్‌, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ ప‌ద్మ సూర్య‌, రాజా త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
స‌మ‌ర్ప‌ణ‌:  నాని
బ్యాన‌ర్‌:  వాల్ పోస్ట‌ర్ సినిమా
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  దీప్తి గంటా
నిర్మాత‌:  ప్ర‌శాంతి త్రిపిర్‌నేని
సినిమాటోగ్ర‌ఫీ:  వ‌సంత్ కుమార్‌
మ్యూజిక్‌:  విజ‌య్ బుల్గానిన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  అవినాశ్
ఎడిట‌ర్‌:  గ్యారీ బి.హెచ్‌
లిరిక్స్‌:  కెకె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.వెంక‌ట‌ర‌త్నం(వెంక‌ట్‌)
పి.ఆర్‌.ఓ:  వంశీ శేఖ‌ర్‌

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close