MOVIE NEWS

మహేష్ ను ఢీ కొట్టబోయేది సముద్రఖని

గతేడాది ‘సరిలేరు నీకెవ్వరూ’ తో భారీ హిట్ సొంతం చేసుకున్నాడు మహేష్. ఆ తరువాత పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనౌన్సమెంట్ అయితే తొందరగానే చేసారు గాని, షూటింగ్ మొదలు పెట్టటానికి చాలా టైం పట్టింది. కరోనా కారణం గా పలుమార్లు ప్లానింగ్ దెబ్బ తిన్నా, ఎలాగోలా రెండు షెడ్యూల్స్ పూర్తి చేయగలిగారు. రెండో షెడ్యూల్ లో ఉన్నప్పుడే కరోనా కలకలం తో షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో షూటింగ్స్ మరోసారి మొదలయ్యాయి. సర్కారు వారి పాట తదుపరి షెడ్యూల్ కూడా మొదలు కాబోతుంది.ఇప్పటి దాకా నటీనటుల గురించే సరైన క్లారిటీ లేదు. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమా లో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ అన్న విషయమే ఎన్నో ర్యూమర్స్ తరువాత అధికారికంగా ప్రకటించారు. ఈమధ్యనే యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కరెప్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నాడని ఓ వార్త బాగా వైరల్ అయింది. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో విలన్ గా నటించిన కోలీవుడ్ నటుడు సముద్రఖని ఇప్పుడు సర్కారు వారి పాటలో మహేష్ తో ఢీ కొట్టనున్నాడట. ఇదికూడా విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారమే కానీ, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close