MOVIE NEWS

Utthara Movie Pre-Release Event

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన
సినిమా ‘ఉత్తర’. జనవరి3 న విడుదలకు సిద్దం అయిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.కొన్ని కథలు కొన్నిజ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి. వాటిలోని స్వచ్ఛదనం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది అలాంటి కథే ఉత్తర. తెలంగాణా సొగసును తెరమీద ఆవిష్కరించిన ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరించేందుకు జనవరి 3 రాబోతుంది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు రాజకీయ ప్రముఖలు పాల్గోన్నారు.

ఈ సందర్బంగా కమెడియన్ వేణు మాట్లాడుతూ:
‘ దర్శకుడు రాసుకున్న సీన్ప్ చదివిని తర్వాత ఆయనపై నమ్మకం పెరిగింది. అంత అందంగా స్ర్కిప్ట్ ని రాసారు. ఏదో ఒకరోజు షూటింగ్ అంతా కొత్త వాళ్లు అనుకుంటూ లోకేషన్ లోకి వెళ్ళిన నాకు ఈ టీం తో పనిచేయడం ట్రీట్ లాగా అనిపించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ’ అన్నారు.

అదిరే అభి మాట్లాడుతూ:
‘ఈ వెంట్ లోబోకే లకు బదులు ఎవరెస్ట్ ని అధిరోహించిన పూర్ణ గురించిన బుక్ ని అతిథులకు అందించారు. దర్శకుడు తిరుపతి ఆలోచనలు అంత సున్నితంగా , లోతుగా ఉంటాయి అనడానికి ఈ ఉదాహారణ చాలు. ఈ సినిమా టీం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఉత్తర లో పనిచేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను’ అన్నారు.


సినిమాటోగ్రాఫర్ చరణ్ బాబు మాట్లాడుతూ:
‘నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు తిరుపతి గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో హీరో శ్రీరామ్, కారుణ్య ప్రేమలో ప్రేక్షకులు పడతారు. క్లోజ్ షాట్స్ లో వీరి నటన చూస్తుంటే చాలా ముచ్చటేసింది. ఈసినిమా కోసం తిరుపతి గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఒక సినిమా కోసం ఇంత కష్టపడతారా అని ఆశ్చర్యం వేసింది. ఆయన నాకుఇన్సిపిరేషన్. ఈ మూవీ తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను’ అన్నారు.


ప్రొడ్యూసర్ శ్రీపతి రంగదాస్ మాట్లాడుతూ:ః
‘ సినిమా చేయాలనే కోరిక ఇప్పటిదికాదు. నాలుగేళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలు పెట్టాం. నా తండ్రి కోరిక మేరకు కుటుంబ బాధ్యతలు తీసుకొని బిజినెస్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా నా మనసులోంచి సినిమా పోలేదు అందుకే తిరుపతి కలసి కథ చెప్పగానే నచ్చి వెంటనే ఓకే చేసాను. నా అంచనాలను మించి సినిమా చేసి చూపించాడు. ఈసినిమా ప్రివ్యూ కి వచ్చేసమయానికి నా తండ్రిగారు మమ్మల్ని వదిలి వెళ్ళి పోయారు. ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. సినిమా యూనిట్ కి చాలామందికి నేను తెలియదు నాపేరు వినిఉంటారు. ఉత్తరలోని పాటలు చాలా బాగా వచ్చాయి . వాటిని వింటూ మా కష్టం మరిచిపోయాము. సినిమాలలో ప్రయత్నించే వాళ్ళను ప్రోత్సహించకపోయినా పర్లేదు కానీ విమర్శించకండి .. కారుణ్య, శ్రీరామ్, దర్శకుడు తిరుపతి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు ..సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

సమర్పకులు రవికుమార్ మాదారపు మాట్లాడుతూ:
‘ఉత్తర లో ఒక మ్యాజిక్ ఉంది. తెలంగాణా పల్లె దనం తెరమీద స్వచ్ఛంగా కనిపిస్తుంది. దర్శకుడు తిరుపతి ఈ సినిమా కోసం చాలా స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నాడు.మా ప్రయత్నం అందరి ఆశిస్సులు అందుకుంటుందని నమ్ముతున్నాను ’ అన్నారు.

హీరోయిన్ కారుణ్య కత్రేన్ మాట్లాడుతూ:
‘ఈ సినిమాలో స్వాతి అనే పాత్రలో కనిపిస్తాను. మా దర్శకుడు తిరుపతి యస్ ఆర్ గారు నేచురల్ గా కథను తెరమీదకు తెచ్చారు. శ్రీరామ్ తో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ‘పిల్లా నా గుండెను పట్టి లాగకే’ పాటలో నా డాన్స్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రతి అమ్మాయి నా పాత్రతో రిలేట్ అవుతుంది. ఒక మంచి టీం తో పనిచేసాననే ఆనందం నాకు ఉంది. మీరు పోరులతో, పోరళ్ళతో థియేటర్ కి రండి అక్కడ కలుద్దాం. మీ ఆశిస్సులు మాకు కావాలి’ అన్నారు.

హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ:
‘నేను సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు నాకంటే మా నాన్న నాపై ఎక్కు వ నమ్మకం ఉంచే వాడు. ఆయన నమ్మకం చూసి నాకు భయమేసేది. ఇక్కడ నేను ఉన్నానంటే దానికి కారణం మానాన్న. ఒక్క పదినిముషాలు మాట్లాడి నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు తిరుపతి గారి నేను ఎప్పటికీ రుణ పడి ఉంటాను. నేను ప్రభాస్ గారి కి పెద్ద ఫ్యాన్ ని ఆయన మొదటిసినిమా ఈశ్వర్ లో అభి అన్న ఉన్నాడు. నా మొదటి సినిమాలో అభి అన్న ఉన్నాడు ఇది పెద్ద సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా తప్పకుండా మీకు నచ్చుతుంది. మా నటన కానీ మా దర్శకుడి పని కానీ నచ్చలేదని ఒక్కరు చెప్పినా నేను ఇండస్ట్రీ నుండి తప్పుకుంటా.. అంత నమ్మకం మాకు ఉంది. కారుణ్య తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను’ అన్నారు.

కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ:ః
‘ఈ సినిమా టీం కి నా అభినందనలు.. తెలంగాణా కథలు తెరమీద మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కథలో ఒక నిజాయితీ కనిపిస్తుంది. దర్శ…

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close