Gossips

సీనియర్ నిర్మాత, దర్శకుడు u. విశ్వేశ్వరరావు ఈ రోజు ఉదయం చెన్నై లో కరొనతో కన్ను మూశారు. ఆయన ntr వియ్యంకుడు, నందమూరి మోహనకృష్ణ ఈయన అల్లుడే.

ఎన్టీఆర్ తో కంచుకోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకులు, పెత్తందార్లు చిత్రాలు నిర్మించారు. ఎన్టీఆర్, పృథ్వీరాజ్ కపూర్ కాంబినేషన్ లో కంచు కాగడా చిత్రాన్ని నిర్మించాలని అనుకొన్నారు కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.

ఆ తర్వాత దర్శకుడిగా మారి తీర్పు, మార్పు, నగ్న సత్యం,కీర్తి కాంతా కనకం, పెళ్లిళ్ల చదరంగం చిత్రాలు రూపొందించారు. తీర్పు చిత్రంలో ఎన్టీఆర్ జడ్జిగా నటించారు. మార్పు సినిమాలో విశ్వేశ్వరరావు గురువు , దర్శకుడు పి. పుల్లయ్య నటించారు.
విప్లవ భావాలతో కెరీర్ ఆరంభించి ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన విశ్వశాంతి విశ్వేశ్వర రావు కరోనా కారణంగా చెన్నైలో మరణించారు.
కంచు కోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకుడు, మార్పు, తీర్పు, హరిచంద్రుడు లాంటి హిట్ సినిమాలని నిర్మించిన విశ్వేశ్వర రావు రామారావుగారితోనే నాలుగు సూపర్ హిట్స్ ఇచ్చి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన ఈయన, అటు ఆర్ట్ సినిమాలు చేస్తూనే కమర్షియల్ కథలతో చిత్రాలు చేసి సక్సస్ సాధించాడు.

నగ్నసత్యం, హరిశ్చంద్రుడు, కీర్తి కాంత కనకమ్ సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ అవార్డులు అందుకున్నారు.

17వ నేషనల్ అవార్డ్స్ కమిటీ జ్యురీ మెంబర్ గా పని చేసిన ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఈ కరోనా ఇంకెంతమందిని కళామతల్లి ముద్దు బిడ్డలని పొట్టన పెట్టుకుంటుందో ఏమో.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close