Gossips

50 మిలియ‌న్స్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డ్ సృష్టించిన బాల‌కృష్ణ‌, బోయ‌పాటిల `అఖండ‌` టైటిల్ రోర్‌

ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన `అఖండ` టీమ్‌

‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది..కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది  ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ‌ విన్నా ఇదే డైలాగ్ వినిపిస్తుంది. ఈ డైలాగ్ అంత పాపుల‌ర్ అవ‌డ‌మే కాకుండా సింహా’, ‘లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` మీద ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని మ‌రింత పెంచింది. ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్‌13న మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో `అఖండ` టీజ‌ర్ విడుద‌లై యూట్యూబ్‌లో అపూర్వ ఆద‌ర‌ణ‌తో దూసుకెళ్తూ కేవ‌లం 16రోజుల్లోనే 50మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియ‌న్స్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ టీజ‌ర్ ఇంత‌టి అఖండ విజ‌యానికి కార‌ణ‌మైన అభిమానుల‌కు, ఆద‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి అఖండ యూనిట్ అభినంద‌న‌లు తెలుపుతోంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర‌ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను మాట్లాడుతూ  –  “సింహా, లెజెండ్ త‌ర్వాత బాల‌య్య‌గారితో చేస్తున్న`అఖండ` సినిమాపై ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. వాటికి ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందించ‌డం జ‌రిగింది. బాల‌య్య న‌టవిశ్వ‌రూపాన్నిఈ సినిమాలో మ‌రోసారి చూస్తారు.  అతి త‌క్కువ రోజుల్లోనే 50మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసే స్థాయిలో `అఖండ` టైటిల్ రోర్‌ని ఇంత అఖండంగా ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కి, అభిమానుల‌కి హృద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ప్ర‌స్తుతం ఈ క‌రోనా ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రు విధిగా మాస్క్ ధ‌రించి చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరుకుంటున్నాను. అలాగే అంద‌రూ వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను“ అన్నారు.

చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ – “మా మూవీ `ఫ‌స్ట్ రోర్‌` విడుద‌లైన ద‌గ్గ‌ర‌ నుండి సినిమాపై మంచి అంఛ‌నాలు ఉన్నాయి. ఇప్పుడు అఖండ టైటిల్ రోర్‌తో ప్రేక్ష‌కుల‌లో, అభిమానుల్లో ఆ అంఛనాలు రెట్టింపు అయ్యాయి. అంద‌రి ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని అందుకునేలా బోయ‌పాటిగారు ఈ చిత్రాన్ని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. అఖండ టైటిల్ రోర్ ప్రేక్ష‌కుల‌, అభిమానుల ఆద‌ర‌ణ‌తో 50మిలియ‌న్ల వ్యూస్ దాటి మ‌రిన్ని రికార్డ్స్ సృష్టిస్తుందని ఆశిస్తున్నాను. మా ద్వార‌క క్రియేష‌న్స్ బేన‌ర్‌లో `అఖండ` త‌ప్ప‌కుండా ఒక ప్ర‌స్టేజియ‌స్ మూవీగా నిలుస్తుంది. బాల‌య్యబాబు, బోయ‌పాటి గార్ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న `అఖండ` నంద‌మూరి అభిమానుల్లో పండగ తీసుకొస్తుంది. ఇప్పుడున్న ఈ క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకున్న త‌ర్వాత త్వ‌ర‌లోనే థియేట‌ర్స్‌లో క‌లుద్దాం“ అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌తో  పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి  నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: త‌మన్‌ ఎస్‌‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: స్ట‌న్ శివ, రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close