Gossips

50మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకున్న ల‌వ్‌లీ హిందీ వెర్ష‌న్ `విజ‌య్ మేరీ హై`.

50మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకున్న ల‌వ్‌లీ హిందీ వెర్ష‌న్ విజ‌య్ మేరీ హై.

ఆదిసాయికుమార్‌, శాన్వీ హీరోహీరోయిన్లుగా బి. జ‌య ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రంల‌వ్‌లీ. ల‌వ్అండ్‌మ్యూజిక‌ల్ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నిఆర్‌జే సినిమాస్ బేన‌ర్‌పై బి.ఎ.రాజు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డంతో పాటు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రి కెరీర్‌లో ఒక మొమ‌ర‌బుల్ మూవీగా నిలిచింది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీలోని అన్ని పాట‌లు ఇప్ప‌టికీ మంచి ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఈ మూవీ హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ విజ‌య్ మేరీహైకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా విజ‌య్ మేరీహై సినిమా 50మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించింది. ఈ సంద‌ర్భంగా..

హీరో ఆదిసాయికుమార్ మాట్లాడుతూ – ప్రేమ‌కావాలి` త‌ర్వాత నా కెరీర్‌లో మ‌రో మొమ‌ర‌బుల్ మూవీ `ల‌వ్‌లీ`. క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా బిగ్ స‌క్సెస్ సాధించింది. ద‌ర్శ‌కురాలు జ‌య‌గారు అద్భుత‌మైన క‌థా-క‌థ‌నంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్, డైలాగ్స్ ఇలా అన్నిచ‌క్క‌గా కుదిరాయి. న‌టుడిగా న‌న్ను మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లిన సినిమా ల‌వ్‌లీ. అనూప్‌గారు ఎవ‌ర్‌గ్రీన్ ఆల్బ‌మ్ ఇచ్చారు. ఇప్ప‌టికీ ఆ పాట‌ల‌ను ఎంజాయ్‌చేస్తుంటాను. బి.ఎ.రాజుగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్‌కాకుండా అత్య‌ద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్ అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసిన ల‌వ్‌లీ హీందీ వెర్ష‌న్ `విజ‌య్ మేరీహై` 50మిలియ‌న్ల మార్క్‌ను చేరుకోవ‌డం చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

నిర్మాత బి.ఎ.రాజు, హీరోయిన్ శాన్వీ, సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌ మాట్లాడుతూ – “ఈ చిత్రం హిందీలో 50 మిలియ‌న్ల మార్క్ క్రాస్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ చిత్రాన్ని హిందీలో డ‌బ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి విజ‌యాభినంద‌న‌లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Back to top button
Close
Close