Gossips

హీరో విరాన్ ముత్తంశెట్టి, నికిత అరోరా ‘బతుకు బస్టాండ్’ చిత్ర వీడియో గ్లింప్స్ కి అనూహ్య స్పందన

విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బతుకు బస్టాండ్ టీమ్ విడుదల చేసిన ట్రిబ్యూట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. అలానే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. హీరో విరాన్, హీరోయిన్ నికిత అరోరా ఇద్దరు చాలా రొమాంటిక్ గా చేతులు పట్టుకుని కూర్చున్నారు. ఈ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా థీమ్ ని పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో విశేష స్పందన తెచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. థ్రిల్లింగ్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు దర్శకుడు IN రెడ్డి. ఈ సినిమాకు వాస్ కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మహవీర్ సంగీతం సమకూరుస్తున్నారు. జూన్ 11న ‘బతుకు బస్టాండ్’ సినిమా విడుదల కానుంది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియోను విడుదల చేస్తున్నారు 
నటీనటులు: విరాన్ ముత్తంశెట్టి, నికిత అరోరా, శృతి శెట్టి తదితరులు
టెక్నికల్ టీం: బ్యానర్ : ఇలవల ఫిల్మ్స్ సమర్పణ : K చక్రధర్ రెడ్డిరచన, దర్శకత్వం : I.N. రెడ్డినిర్మాతలు : I.కవితా రెడ్డి, K.మాధవిDOP : వాస్ కమల్సంగీతం : మహవీర్Pro : ఏలూరు శ్రీను & మేఘ శ్యామ్కొరియోగ్రఫీ : శివాజీయాక్షన్ : శంకర్.U

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close