Gossips

సోనూ సూద్‌కు సోకిన కరోనా.. అందోళన వద్దంటూ ట్వీట్..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు చిన్నోడు పెద్దోడు అందరూ వణికిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలెబ్రీటీల వరకు అందరూ దీనికి సమానమే. ఇప్పటికే ఈ కరోనా కారణంగా పలువురు సినీ సెలెబ్రిటీస్ మరణించగా.. చాలా వరకు పాజిటివ్ వచ్చినా సరైనా చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్, నటుడు నిర్మాత బండ్ల గణేష్ దీని బారిన పడగా.. ఇక తాజాగా సినీ నటుడు సోనూ సూద్‌కు కూడా కరోనా సోకిందని తెలిసింది. దీనికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియాలో తెలుపుతూ ఈరోజు మార్నింగ్ తనకు టెస్ట్ చేస్తే.. కరోనా సోకిందని అయితే ఆరోగ్యం బాగానే ఉందని తెలిపాడు

లాక్ డౌన్ సమయంలో ముఖ్యంగా వలసకూలీలకు తోడుగా నిలిచి వారి తమ స్వస్థలాలకు చేర్చాడు సోనూ.. ఇక అప్పటినుండి ఆయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. ఇక అప్పటినుండి ఆయన అవసరమున్న వారికి నిరంతరం సహాయం చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా సోనూ సూద్ చాలా మంది విద్యార్థులకు ఫీజు చెల్లించాడు. ఇంకోంత మందికి మెడిసిన్ ఖర్చులను భరించాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందడానికి సహాయపడ్డారు. ఇలా తనకు చేతనైనా సాయం చేస్తూనే ఉన్నాడు. దీంతో అతనికి సోషల్ మీడియాతో పాటు బయటకుడా విపరీతంగా ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో కలియుగ కర్ణుడు అని ఆయనను పిలుస్తున్నారు నెటిజన్స్.

అంతేకాదు మీకు ఏ అవసరం ఉన్నా నేను ఉన్నాను అంటూ,  తన ఆరోగ్యం బాగానే ఉందని అందోళన చెందవద్దని ఆయన తన అభిమానులకు భరోసా ఇచ్చాడు. ఇక్కడ విశేషమేమంటే ఆయన కరోనా ఫస్ట్ డోస్ తీసుకున్నాడు. అయిన కూడా కరోనా సోకింది. ఇక కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ ప్రజలకు అండగా నిలిచి హీరో అయ్యాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులపాలైన సామాన్యులకు అండగా నిలిచి గొప్ప మనసున్న నటుడుగా గుర్తింపు పొందాడు సోనూ సూద్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close