Gossips

ఏనుగుల సమస్యలకు అరణ్య సినిమాతో వాయిస్‌ ఇచ్చాం – దర్శకుడు ప్రభు సాల్మోన్

వర్సటైల్‌ హీరో రానా ప్రధాన పాత్ర పోషించిన చిత్రం అరణ్య. ప్రభు సాల్మోన్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ నిర్మించిన ఈ మూవీ మార్చి 26న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలఅవుతుంది. హిందీలో హాథీమేరేసాథీ, తమిళంలో కాదన్‌ అనే టైటిల్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్ర దర్శకుడు ప్రభు సాల్మోన్‌ చెప్పిన విశేషాలు….

– 2013లో కుంకీ సినిమా చేస్తున్నప్పుడు ముధుమళైలోని మసనంగుడి ప్రాంతానికి ఆర్‌ అండ్‌ డీ వర్క్‌ కోసం వెళ్లాను. అక్కడ ఏనుగులు గురించి ఆన్‌టోల్డ్‌ స్టోరీస్‌ ఉన్నాయని తెలుసుకున్నాను. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో ఏనుగులు ఎక్కువగా ఉన్న దేశం మనదే. ఇండియాలో ఉన్న ఏనుగులు సంఖ్య క్రమక్రమంగా ఎలా తగ్గిపోతుందనే విషయం నాకు తెలిసింది. అడవుల వీస్తీర్ణంలో ఏనుగులు ప్రాముఖ్యత ఉంది. అడవుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనందరికి తెలుసు. ఆ సమయంలో మనుషులు, ఏనుగులు మధ్య ఓ సంబంధం ఉండేలా సినిమా తీయాలని అనిపించింది. అలాగే ఘాజీరంగా ఎలిఫెంట్‌ వార్‌ కూడా నన్ను ఇన్‌స్పైర్‌ చేసింది.

– ప్రకృతితో ముడిపడి ఎన్నో కథలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న కరోనా కూడా అలాంటిదే. మనం ప్రకృతిని మన స్వార్థం కోసం చెడుగా వినియోగించినప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ప్రకృతి క్రమం తప్పితే ఎలా విపత్తులు సంభవిస్తాయి అనే దానికి కరోనా పరిస్థితులను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నేచర్‌ని డిస్ట్రబ్‌ చేస్తే ఆ ప్రభావం మానవజీవితాలపై కూడా ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.

– అరణ్య సినిమాలో ఫారెస్ట్‌మన్‌గా ఎవర్ని తీసుకోవాలనేది నాకు ఓ ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో హీరో లుక్‌ కోసం ఓ డిజైన్‌ను నేను ఊహించుకున్నాను. ఆరడుగుల హైట్, చేతిలో స్టిక్‌ అలా ఓ లుక్‌ను అనుకున్నాను. నేను కుంకీ సినిమాలో చేసే టైమ్‌లో ఓ సారి రానా కలిశారు. నేను ఊహించుకున్న లుక్‌లో రానా అయితేనే సూట్‌ అవుతాడని అనిపించింది. ఆయన్ను కలిసి కథ చెప్పాను. ఆయనకు నచ్చడంతో అరణ్య మొదలైంది.

– ఫారెస్ట్‌మన్‌ జాదేవ్‌గారిని కలవలేదు కానీ ఆయన జీవిత ఇతివృత్తాన్ని సినిమాలో చూపించాము. ఆయన ఒక్కరే లక్షకు పైగా చెట్లు నాటి ఓ అడవినే సృష్టించాడు. ఇప్పుడు ఆ అడవిలో వందకుపైగా ఏనుగులు నివాసం ఉంటున్నాయి. చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఏనుగుల సమస్యలకు అరణ్య సినిమా ద్వారా వాయిస్‌ ఇచ్చాం.

– ఈ సినిమా లొకేషన్స్‌ కోసం కష్టపడ్డాం. ఏనుగులతో షూటింగ్‌ చేయాలంటే ప్రాపర్‌ పర్మిషన్స్‌ కావాలి. వియత్నాం, బర్మా, థాయ్‌ల్యాండ్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేశాం. శ్రీలంకలో ట్రై చేశాం కానీ కుదర్లేదు. థాయ్‌ల్యాండ్‌లో ఎలిఫెంట్‌ పార్క్స్‌ చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ టూరిజం కోసం ఉపయోగించే ఏనుగులపై మేజర్‌ షూట్‌ చేశాం. ఈ సినిమాలో ఫస్ట్‌ హీరో, సెకండ్‌ హీరో అని లేరు. కథే అన్ని పాత్రలను నడిపిస్తుంది. ఈ సినిమాలో సాంగ్స్‌కు స్కోప్‌ లేదు. జంతువుల ఎమోషన్స్‌ ఉంటాయి.

– మూడున్నర ఏళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. ప్రస్తుతం రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నాను. నేను డైరెక్ట్‌ చేసిన మైనా, కుంకీ సినిమాల కోసం ఎక్కువగా అడవుల్లోనే స్పెండ్‌ చేశా. కానీ రానా, జోయా, విష్ణు, శ్రీయాలకు అడవుల్లో స్పెండ్‌ చేయడం కొత్త. అందుకే ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ సమయంలో దోమలు, కొన్ని పురుగులు, కీటకాలతో కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. ఆ తర్వాత మెల్లిగా వాళ్లు కూడా అలవాటైపోయారు.

– థాయ్‌ల్యాండ్‌లో ఫస్ట్‌ డే షూటింగ్‌ చేసేప్పుడు ఇలా షూట్‌ స్టార్ట్‌ చేశామో లేదో ఇలా ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ ఎంక్వేరీకి వచ్చారు. మేం షూటింగ్‌ చేసేప్పుడు ఫారెస్ట్‌ స్టాఫ్ కూడా మాతో ఉన్నారు. చెట్లను నరకకూడదు. ఏం చేయకుండా షూటింగ్‌ చేసుకోమన్నారు. అక్కడ అడవికి, చెట్లకు అంత ప్రాముఖ్యత ఇస్తారు.

– ఈ సినిమా ఒక రియల్‌ ఎడ్వేంచెర్స్‌. ఆరిస్టులకు క్యారవేన్స్‌ కూడా ఉండేవి కావు. కొన్ని లొకేషన్స్‌లో అయితే మోబైల్‌ సిగ్నల్స్‌ కూడా లేని ప్రాంతంలో ఓ పాతిక రోజులు షూటింగ్‌ జరిపాం. ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ అంత సులువు కాదు. కొన్నిచోట్ల ఆర్టిస్టులు కూర్చొడానికి కూడ సరైన సదుపాయాలు లేకున్నా చిత్రీకరణ జరిపాం.

– కుంకీ సినిమాలో ఎలిఫెంట్స్‌ ఓ పార్ట్‌. కానీ అరణ్య వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఇది కంప్లీట్‌ ఎలిఫెంట్స్‌ స్టోరీ. ఈ సినిమా ఓ మనిషికి, ఏనుగులకు మధ్య ఉన్న అనుబంధం గురించి చెబుతుంది. ఏనుగుల సమస్యలపై ఆ మనిషి ఎలా పోరాడాడు అన్నదే కథాంశం.

– ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇక్కడి ‘బాహుబలి’ సినిమాను చైనాలో రిలీజ్‌ చేసిన టీమ్‌ అరణ్య సినిమా కూడా చైనాలో విడుదల చేయాలను కుంటున్నారు. ఇదొక ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌. యూనీ వర్సల్‌ సబ్జెక్ట్‌. థాయ్‌ భాషలో కూడా ఈ సినిమాను విడుదల చేసే ఆలోచన ఉంది. ఏనుగుల సంఖ్య తగ్గిపోవడం అనే సమస్య ప్రతిదేశంలో ఉంది. అందుకే ఈ సినిమాకు ఏ దేశంలో అయిన మంచి ప్రేక్షకాదరణ లభిస్తుందని నమ్ముతున్నాను.

– నా సంతృప్తి కోసమే భిన్నమైన సినిమాలు చేస్తున్నాను. కమర్షియల్‌ సినిమాలు కూడా చేస్తాను. కానీ మంచి కథ కుదరాలి అంటూ ముగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close